Share News

పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:24 PM

మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ఈనెల 11న జరగనున్న పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాల ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు.

పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి
బ్యాలెట్‌ పేపర్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ఈనెల 11న జరగనున్న పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాల ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయ భవన సమావేశ మందిరంలో మాస్టర్‌ ట్రైన ర్ల ఆధ్వర్యంలో పీవో, ఏపీవోలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. పోలింగ్‌ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుం డా చూడాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 800 ఓటర్లకు మించకుండా పోలింగ్‌ జరిగేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలింగ్‌ సిబ్బందికి ప్రతీ అంశం తెలిసి ఉండాలన్నారు. పోలింగ్‌ అధికారులకు కేంద్రాల్లో తాగునీరు, మూత్రశాలలు, లైటింగ్‌, ఫ్యాన్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. 11న పోలింగ్‌, ఏమైనా సమస్యలుంటే 12న రీ పోలింగ్‌, 13న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేష న్‌ కమిషనర్‌ అన్వేష్‌, మాస్టర్‌ ట్రైనర్లు హరిప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు.

బ్యాలెట్‌ పేపర్ల ముద్రణలో అప్రమత్తంగా వ్యవహరించాలి

మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా బ్యాలెట్‌ పేపర్ల ముద్రణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని బ్యాలెట్‌ పేపర్లముద్రణ కోసం ఎంపిక చేసిన ప్రింటింగ్‌ ప్రెస్‌ను బుధవారం ఆకస్మికంగా సందర్శించి ముద్రణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని, అర్హత గల అభ్యర్ధులకు నిబంధనల ప్రకారం ఎన్నికల గుర్తులు కేటాయించామన్నారు. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 60 డివిజన్లలో 240 మంది, బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో 173 మంది, చెన్నూరులోని 18 వార్డుల్లో 107 మంది, క్యాతనపల్లిలోని 22 వార్డుల్లో 113 మంది, లక్షెట్టిపేటలోని 15 వార్డుల్లో 60 మంది ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. ప్రింటింగ్‌ ప్రెస్‌ యాజమాన్యం బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ సమ యంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్‌, అదికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:24 PM