ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:46 PM
జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్‌మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థు లకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రాందాస్
ఆసిఫాబాద్‌రూరల్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్‌మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థు లకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రాందాస్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్‌ను తనిఖీచేసి వివరాలు వెల్లడిస్తూ జిల్లాలోని 11 ప్రభుత్వ, 37 ప్రైవేటు, గురుకుల, కేజీబీవీ కళాశాలలు ఉండగా 4,619 మంది జనరల్, ఒకేషనల్ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలో రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా మొదటి విడత సోమవారం నుంచి ఈనెల ఆరో తేది వరకు, రెండో విడత ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపా రు. దీనిలో భాగంగా మొదటిరోజు ఉదయం జనరల్ విద్యార్థులు 463 మందికి గాను 447 మంది హాజరుకాగా 16 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 599 మందికి గాను 533 మంది హాజరు కాగా 66 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జనరల్ విభాగంలో 384 మందికి గాను 375 మంది హజరు కాగా 9 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విబాగంలో 595 మంది గాను 582 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరైనట్టు తెలిపారు.
వాంకిడి: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైనట్లు కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ చంద్రయ్య తెలిపారు. పరీక్షలు ఈ నెల 11 వరకు జరుగుతాయని, మొదటి రోజు మొదటి, ద్వితీయ సంవత్సరంలో 63 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని డీఐఈఓ రాందాస్, డీఈసీ మెంబర్ అనీల్‌కుమార్‌లు సందర్శించారు.