కౌంటింగ్ కేంద్రంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:49 AM
రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హరిత సూచించారు.
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హరిత
ఆసిపాబాద్‌రూరల్/కాగజ్‌నగర్ ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యో తి): రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హరిత సూచించారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో, కాగజ్‌నగర్ లోని డీఏవీ పాఠశాలలో పంపిణీ కేంద్రాన్ని ఏ ర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సా మగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రం, పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సంద ర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం సిబ్బందికి, పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాం టి లోటుపాట్లు లేకుండా చూడాలని తెలిపారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అర్హత గల ప్రతి ఒక్కరు ఈ నెల 11న తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె హరిత తెలిపారు. ఎన్నికల జరుగుతు న్న ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు, ఇతర సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా యజ మాన్యాలు పోలింగ్ రోజున వేతనం తో కూడిన సెలవు ప్రకటించాలని తెలిపారు.
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్రఎన్నికల కమిషనర్ రాణికు ముదిని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నిక ల అధికారులు, కలెక్టర్‌లు, ఎస్‌పీలు, అదనపు కలెక్టర్‌లు, పరిశీలకులు, మున్సిపల్ కమిషనర్లతో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
3వ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
ఆసిఫాబాద్: మూడో ర్యాండమైజేషన్ ప్రక్రి యను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కె హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లోని సమీకృత కలెక్టరేట్ సముదాయ భవనం లోని వీసీ హాల్‌లో మున్సిపల్ ఎన్నికల్లో భాగం గా ఈ నెల 11న జరిగే ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఎన్నికలవిధులు నిర్వహించే సి బ్బందిని మూడో ర్యాండమై జేషన్ ప్రక్రియ కా ర్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరిత మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకు లు అలోక్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి హాజరయ్యారు.
డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొందాలి
ఆసిఫాబాద్: గిరిజన విద్యార్థినులు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొందా లని కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీతకృత కలెక్టరేట్ సముదా యంలో గల కలెక్టర్ చాంబర్‌లో మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు సంబంధిత గోడ ప్రతు లను ఆవిష్కరించారు.
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి
ఆసిఫాబాద్: జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీతకృత కలెక్టరేట్ భనవ సముదాయంలో గల కలెక్టర్ చాంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారం కార్యక్రమానికి సంబంధిత గోడ ప్రతులను బ్యాంకు అధికారులు, జిల్లా పౌర సంబంధాల అధికారి సంపత్‌కుమార్‌తో కలిసి ఆవిష్కరించా రు. ఈ నెల 13 వరకు దేశ వ్యాప్తంగా నిర్వహి స్తున్న ఆర్థిక అక్షరాస్యత వారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పిం చాలని తెలిపారు. బ్యాంకులు తమ వెబ్‌సైట్లు, ఏటీఎం స్ర్కీన్‌లు, శాఖలలో పోస్టర్ల ద్వారా ప్రజ లకు తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు.