Share News

విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:32 PM

విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పత్ర్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని బుధవారం కలెక్టర్‌ సందర్శించారు.

విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
నెన్నెల కస్తూర్బా విద్యాలయం అదనపు గదుల నిర్మాణం పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నెన్నెల, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పత్ర్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని బుధవారం కలెక్టర్‌ సందర్శించారు. అదనపు గదుల నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాన్యమైన విద్య అందిం చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద న్నారు. విధ్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధతో నూతన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నామ న్నారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యే కశ్రద్ధ తీసుకోవాలని, వారిని వార్షిక పరీక్షల కోసం సన్నద్ధం చేయాలని సూచించారు. అంతకు ముందు టీజీఐఐసీ సంబంధిత భూములను బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ఆయన వెంట స్థానిక తహసిల్దార్‌ శ్రీనివాస్‌ ఉన్నారు.

నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

బెల్లంపల్లి (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం బెల్లంపల్లి పట్టణంలో చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. పాఠశాల నిర్మాణ పనులను బుధవారం ఆకస్మికంగా సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందులో భాగంగా 25 ఎకరాల విస్తీర్ణంలో రూ. 200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మాణా నికి చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలోని మం చిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల పరిధిలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్మాణపనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవా లన్నారు. సంబంధిత అధికారులు ఉన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:32 PM