Home » YSRCP
అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం శాసనమండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.
గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం చొప్పున బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రులు కొనియాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం శాసనసభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా వారు ప్రసంగించారు.
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమీకరణ, వ్యయం, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు వంటి అంశాలపై సభ్యులు శ్రావణ్‌కుమార్, బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.
జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేంద్రరెడ్డి కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ఓ రౌడీషీటర్‌తో రూ.కోటిన్నరకు వైసీపీ నేత సుపారీ మాట్లాడినట్లు సమాచారం.
AP మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. కాశీబుగ్గలో నమోదైన హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి సోంపేట కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు పోలీసులు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించిన ఆ పార్టీ నేతలపై మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు పోలీసులు కేసులు నమోదు చేశారు.
నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సొంత ఇళ్ల పట్టాలు బనగానపల్లె ప్రజల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు.
మెగా డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నేతలు సోమవారం చేపట్టిన నిరసనల్లో అసలైన అభ్యర్థులు ఒక్కరూ కనిపించలేదు. చాలా ప్రాంతాల్లో డీఎస్సీతో సంబంధం లేని ఇంటర్ విద్యార్థులను, వలస కూలీలను రంగంలోకి దింపి... వారంతా డీఎస్సీ అభ్యర్థులేనన్నట్టుగా వైసీపీ నేతలు కలరింగ్ ఇచ్చారు.
మహిళా ఎస్ఐపై దాడి కేసులో వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు ఆగస్టు 21వ తేదీ వరకు శ్రీకాకుళం కోర్టు రిమాండ్ విధించింది. 13 రోజుల పాటు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అనంతరం రవికుమార్‌ను జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.