Home » YSRCP
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలందరూ జగన్‌కి జ్ఞానోదయం చేయాలని హితవు పలికారు.
రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాట ధర కల్పిస్తున్నామని నొక్కిచెప్పారు. బుడమేరు గట్టులు మరమ్మతులు చేయకపోవడంతోనే వరదలు వచ్చాయని వంగలపూడి అనిత పేర్కొన్నారు.
వైసీపీ నేతల చేతిలో దారుణ హింసకు గురైన పవన్ కుమార్‌ను చిత్తూరులో బంధించింది ఎవరు? అతని వాయిస్ రికార్డు చేసి వీడియోలు విడుదల చేసిందెవరు? తిరుపతిలో దాడికి గురైన పవన్ చిత్తూరుకు ఎలా వెళ్లాడు? రౌడీ మూకలకు భయపడి తలదాచుకున్నాడా? లేకుంటే ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లి బంధిం చారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పులివెందులల్లో సాక్షి మీడియాను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. ఏపీ నలుమూలల నుంచి పులివెందులకు సాక్షి రిపోర్టర్‌లు వచ్చారని చెప్పుకొచ్చారు. వాళ్లకు వాళ్లే దాడి చేసుకొని తమపై నింద వేయడానికి ప్లాన్ చేస్తున్నారని బీటెక్ రవి ధ్వజమెత్తారు.
సృష్టి ఫెర్టిలిటీ కేసులో వైసీపీ నేత సోదరుడు కీలకంగా ఉన్నట్లు సమాచారం. సృష్టి కేసులో అరెస్ట్ అయిన విశాఖ కేజీహెచ్‌కు చెందిన ముగ్గురు వైద్యులు ఉన్నారు. ఈ ముగ్గురులో ఒకరు డాక్టర్ వాసుపల్లి రవికుమార్ కూడా ఉన్నారు. కేజీహెచ్‌లో అనస్తీషియాలజీ విభాగాధిపతిగా, డిప్యూటీ సూపరింటెండెంట్‌గా రవి కుమార్ కొనసాగుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. రెండు చోట్ల, టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయనిసీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్‌లు ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని సీపీఐ నారాయణ విమర్శలు చేశారు.
వైసీపీ కీలక నేత భూమన అభినయ్ అనుచరుల అరాచకాలు తిరుపతిలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తిరుపతి వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ రెడ్డి, అతని స్నేహితులు దళిత యువకుడిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
కడప జిల్లాలో ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. పులివెందుల నుంచి 11 మంది పోటీ చేస్తుండగా ఒంటిమిట్ట నుంచి కూడా 11 మందే బరిలో ఉన్నారు. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి పోటీలో ఉన్నారు.
పాలకొల్లుకు చెందిన వైసీపీ నాయకులు క్రికెట్ బెట్టింగ్‌లో దొరికినా, అక్రమ సంపాదనలు వెలుగు చూసినా అరాచకాలను సాక్షి దినపత్రిక ఎందుకు ప్రచురించడం లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. తాను బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే సాక్షి దినపత్రికలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.