Nagarjuna Yadav: వైసీపీ నేత నాగార్జున యాదవ్ వీరంగం.. హోటల్ యజమానిపై దాడి..
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:52 AM
ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన యజమాని శేఖర్ పోలీసులను ఆశ్రయించారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో నాగార్జున యాదవ్‌పై ఫిర్యాదు చేశారు.
పల్నాడు: సత్తెనపల్లి పట్టణంలో వైసీపీ నేత నాగార్జున యాదవ్ వీరంగం సృష్టించారు. గుడ్ మార్నింగ్ హోటల్ యజమానిపై యనమల నాగార్జున యాదవ్ దాడికి పాల్పడ్డారు. సరైన సమయంలో టిఫిన్ అందించలేదని హోటల్ యజమాని శేఖర్, సిబ్బందిపై ఆయన అనుచరులతో దాడకి దిగారు. ఈ ఘర్షణలో హోటల్ సిబ్బందిలో ఇద్దరికి గాయాలయ్యాయి. తాను పిలిస్తే.. ఊళ్లకు ఊళ్ళు కదలి వస్తాయని హోటల్ యజమాని శేఖర్‌కు నాగార్జున యాదవ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన యజమాని శేఖర్ పోలీసులను ఆశ్రయించారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో నాగార్జున యాదవ్‌పై ఫిర్యాదు చేశారు. శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. హోటల్ యజమాని, సిబ్బందిపై దాడి చేసిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Ind-China Flight Service: కుదిరిన అంగీకారం.. భారత్, చైనా మధ్య ఈ నెలాఖరు నుంచీ..
President Murmu At Red Fort Dasara: ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్