Home » YS Jagan Mohan Reddy
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రప్పా రప్పా అనడంలో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా మీ భాషా అదేనా అని మంత్రి డీబీవీ స్వామి ప్రశ్నించారు.
గత జగన్ పాలనలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా ఏరులై పారేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. గంజాయి కేసుల్లో పట్టుబడితే సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నామని ఉద్గాటించారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చుదామని దిశానిర్దేశం చేశారు. విద్యరంగానికి తమ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తోందని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీసులను పక్కకు తోసేసి వీరంగం సృష్టించారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వైసీపీ అధినేత జగన్ మెప్పు, బిస్కెట్ల కోసం ఆ పార్టీ నేతలు అనిల్ కుమార్ ప్రసన్నకుమార్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని సినీ నటుడు కిరాక్ ఆర్పీ ధ్వజమెత్తారు. ఆడవాళ్ల జోలికొచ్చినా, కించపరిచినా బాగుపడే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ప్రసన్న, అనిల్ కుమార్ పతనం ప్రారంభమైందని కిరాక్ ఆర్పీ విమర్శించారు.
పరామర్శల పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో మామిడి రైతులని బుధవారం పరామర్శించనున్నారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఖండించారు. మహిళల జోలికి వస్తే వైసీపీ నేతలను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యమన్నా, కోర్టులన్నా జగన్ రెడ్డికి లెక్క లేకుండా పోయిందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పోలీసు, న్యాయవ్యవస్థలు ఛాలెంజ్గా తీసుకొని జగన్ రెడ్డిపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించాలని దేవినేని ఉమ కోరారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు జిల్లా పోలీసులు ఆదివారం నోటీసులు ఇచ్చారు. ప్రజా ఆస్తికి నష్టం కలిగించారనే కారణంతో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో అపారమైన ఖనిజాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. జగన్ హయాంలో అభివృద్ధిలో ఈ జిల్లాని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Vamsi Meets Jagan: జైలు నుంచి విడుదలైన త్వర్వాత మాజీ ఎమ్మెల్యే వంశీ.. వైసీపీ అధినేత జగన్తో భేటీ అయ్యారు. వివిధ కేసుల్లో దాదాపు ఐదు నెలల పాటు వంశీ జైలులో ఉన్న విషయం తెలిసిందే.