Chandrababu On Anantapur: ఇక్కడ ఉన్నది CBN, పవన్ కల్యాణ్.. వైసీపీకి చంద్రబాబు కౌంటర్
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:16 PM
ఏపీలో వైసీపీ ఉనికి కోల్పోతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ ఆఫీసులు మూసేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. వైసీపీ నేతలకు అసెంబ్లీలో చర్చించే దమ్ముందా..? అని ప్రశ్నించారు.
అనంతపురం: మెడికల్ కాలేజ్ అంటే ఏంటో తెలియని జగన్.. వాటి గురించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. భూమి ఇవ్వగానే అది మెడికల్ కాలేజ్ అయిపోదని తెలిపారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ విజయోత్సవ సభలో ఆయన మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. 17 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్కటి మాత్రమే పూర్తయిందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు పునాదులు వేసి వదిలేసిందని ఆరోపించారు. అందుకే తమా హయాంలో పీపీపీ విధానం తీసుకొచ్చామని చెప్పారు. మెడికల్ కాలేజీల అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి సవాల్ చేశామని గుర్తు చేశారు. అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే ఎవరేం చేశారో తేలిపోతుందన్నారు. గతంలో సిద్ధం.. సిద్ధం.. అన్నారు.. ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా.. అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఏపీలో వైసీపీ ఉనికి కోల్పోతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ ఆఫీసులు మూసేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. వైసీపీ నేతలకు అసెంబ్లీలో చర్చించే దమ్ముందా..? అని సూటిగా.. ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు.. తాము కాదని హితవు పలికారు. వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకుండా రప్పా.. రప్పా.. అంటూ రంకెలేస్తున్నారని విమర్శించారు. రప్పా.. రప్పా.. అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
మీ బెదిరింపులకు ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని పేర్కొన్నారు. గుర్తుంచుకోండి.. ఇక్కడ ఉన్నది CBN, పవన్ కల్యాణ్ అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసా రాజకీయాలు చేసినవారు ఎక్కడున్నా వదిలిపెట్టమని అన్నారు. వైసీపీ వారు ఫేక్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఒంటిమిట్ట, పులివెందులలో ప్రజలు వైసీపీ బెండు తీశారని గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..