Home » YCP
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
క్కర్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని ములాఖత్‌లో కలిసిన పలువురు నేతలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడాన్ని గమనించాలి. ఫించన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచి ప్రతి నెలా టంచన్‌గా అందిస్తోంది. అయినా సరిగా ఇవ్వడం లేదని, కొన్ని వేల పింఛన్లు తొలగించారని వైసీపీ నేతలు విమర్శించడం వారి దుర్భుద్ధికి నిదర్శనం..
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏసీబో కోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. మద్యం కుంభకోణంలో కేసులో నిందితులుగా ఉన్న ఏ31-ధనుంజయ రెడ్డి, ఏ32-కృష్ణ మోహన్ రెడ్డి, ఏ-33 బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
రాయదుర్గంలో వైసీపీకి కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సహా ఐదుగురు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం ఆ పార్టీలో చేరారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఒక ఫేక్ పార్టీ అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనపై హత్య కుట్రకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియాల్లో ఎన్ని వీడియోలు పెట్టుకున్నా తనకేం భయంలేదని.. కానీ, ఓ పౌరుడిగా తనకు న్యాయం చేయాలని కోరారు.
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు మరోసారి కొబ్బరికాయ పరీక్ష ఎదురైంది. ఆయన సీఎంగా ఉండగా...
డాక్టర్ వైఎ్‌సఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రైతు దంపతుల విగ్రహాలను నాలుగు వారాల వరకు ప్రారంభించవద్దని వర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది...
రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ బెయిల్ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తానేమీ తప్పు చేయలేదని.. అనవసరంగా నన్ను కెలకొద్దంటూ వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
కొన్ని రోజుల క్రితం కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి తనను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతోనే తన హత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా పోలీసులు ఈ కేసులో A5 గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని చేర్చారు.