Arjun Reddy Case: వైసీపీకి మరో షాక్.. జగన్ బంధువుకు పోలీసుల నోటీసులు
ABN , Publish Date - Dec 16 , 2025 | 09:05 AM
వైసీపీ అధినేత జగన్‌కు మరో షాక్ తగిలినట్టయింది. ఆయన సమీప బంధువు అర్జున్ రెడ్డికి నోటీసులిచ్చారు గుడివాడ పోలీసులు.
అమరావతి, డిసెంబర్ 16: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సమీప బంధువైన అర్జున్ రెడ్డి(Arjun Reddy)కి గుడివాడ పోలీసులు నోటీసులిచ్చారు(Gudivada Police). సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారంటూ 2025 నవంబర్‌లో ఆయనపై కేసు నమోదైంది.
ఈ కేసులో భాగంగా.. అప్పట్లోనే అర్జున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే.. అర్జున్ విదేశాలకు పరారవ్వడంతో సాధ్యపడలేదు. ఆ తర్వాత ఆయనపై లుక్‌అవుట్ సర్య్కూలర్ జారీ చేశారు అధికారులు. సోమవారం రాత్రి అర్జున్.. విదేశాల నుంచి ఇండియాకు తిరిగొచ్చారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు(Immigration Officials) విమానాశ్రయంలోనే ఆయన్ను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు.. ఆయన్ను అదుపులోకి తీసుకుని సీఆర్పీసీ(CRPC) సెక్షన్-41 ఏ కింద నోటీసులు అందజేశాయి. అయితే.. అప్పటికే తన న్యాయవాదుల్ని ఎయిర్‌పోర్టు(Airport)కు పిలిపించుకున్నారు అర్జున్. ఉమ్మడి కడప సహా అనేక జిల్లాల్లో అర్జున్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి: