Home » WPL
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-యూపీ వారియర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. లీగ్ స్టేజ్‌లో ఇదే చివరి మ్యాచ్ కాగా.. ఈ ఫలితంలో ప్లే ఆఫ్స్‌లో మూడో బెర్తు ఎవరిదో తేలనుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ జట్లు వడోదర వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన గుజరాత్ బ్యాటర్లు రాణించారు. నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేశారు.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా వడోదర వేదికగా గుజరాత్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ముంబై ఫీల్డింగ్ చేయనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డబ్ల్యూపీఎల్-2026 డీసీ జట్టు సారథిగా ప్రమోషన్ పొందిన జెమీమాకు నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచులో భారీ జరిమానా పడింది.
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా వడోదర వేదికగా ఆర్సీబీతో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన నాట్ సీవర్ బ్రంట్ (100*; 57 బంతులు) శతకంతో ఆకట్టుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ లిజెలీ లీకి షాక్ తగిలింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో ఆమె కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు లీపై చర్యలు తీసుకున్నారు. ఆమె మ్యాచు ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను విధించారు.
మహిళా ప్రీమియర్ లీగ్- 2026లో ఇవాళ (మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది.
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిగింది. గాయం కారణంగా కీలక ప్లేయర్ జట్టుకు దూరమైంది. ఆ జట్టు వికెట్ కీపర్ జి.కమలినీ టోర్నీ నుంచి వైదొలిగింది. ఆమె స్థానంలో వైష్ణవి శర్మ టీమ్‌లోకి రానుంది.
డబ్ల్యూపీఎల్ 2026లో ఆర్సీబీ జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది. ఆడిన ఐదింట్లో అన్నీ గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ స్మృతి మంధాన తమ జట్టు విజయ రహస్యాన్ని చెప్పేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.