Share News

డబ్ల్యూపీఎల్ 2026: ఆదుకున్న మూనీ.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 169

ABN , Publish Date - Feb 03 , 2026 | 09:18 PM

మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచులో గుజరాత్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

డబ్ల్యూపీఎల్ 2026: ఆదుకున్న మూనీ.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 169
WPL 2026

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా వడోదర వేదికగా జరుగుతోన్న ఎలిమినేటర్ మ్యాచులో గుజరాత్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ బెత్ మూనీ(62*) హాఫ్ సెంచరీతో చెలరేగింది. మూనీ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. ఆఖరి వరకు మూనీ పోరాడటంతో గుజరాత్.. ఆ మోస్తరు స్కోరు అయినా చేయగలిగింది.


మూనీతో కలిసి జార్జియా వేర్‌హమ్(35) కాసేపు క్రీజులో నిలిచి భారీ షాట్లే ఆడింది. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 46 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనుష్క శర్మ(16), కాష్వీ గౌతమ్(18) పర్వాలేదనిపించారు. కెప్టెన్ గార్డ్‌నర్(0) తీవ్రంగా నిరాశపర్చింది. సోఫీ డివైన్(6), కనిక(6), భారతీ ఫుల్మలి(0) విఫలమయ్యారు. మరీ ముఖ్యంగా ఢిల్లీ.. ఫీల్డింగ్‌లో అదుర్స్ అనిపించింది. ఢిల్లీ బౌలర్లలో హెన్రీ 3, నందని శర్మ 2, మిన్ను మణి ఒక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్

అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!

Updated Date - Feb 03 , 2026 | 09:18 PM