Share News

పాక్ టీమ్ భారత్‌కు పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు: సంజయ్ మంజ్రేకర్

ABN , Publish Date - Feb 03 , 2026 | 04:39 PM

భారత్‌తో పాక్ ఆడటంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ టీమ్ బలహీనంగా ఉందని.. టీమిండియాకు పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదని అభిప్రాయపడ్డాడు. భారత్‌తో మ్యాచ్ ఆడకపోయినా ఫర్వాలేదని అన్నాడు.

పాక్ టీమ్ భారత్‌కు పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు: సంజయ్ మంజ్రేకర్
Sanjay Manjrekar

ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 7 నుంచి టీ-20 ప్రపంచ కప్-2026 ప్రారంభం కానుంది. దీనికి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే బంగ్లాను ఈ మెగా టోర్నీ నుంచి ఐసీసీ తప్పించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని ప్రయత్నించింది. కానీ ఆ దేశ ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రపంచ కప్ ఆడుతామని, కానీ భారత్‌తో మ్యాచులు ఆడబోమని పీసీబీ ప్రకటించింది. ఈ విషయంపై తీవ్ర దుమారం చెలరేగింది. భారత్‌తో మ్యాచులు బహిష్కరిస్తే పాక్.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) కీలక వ్యాఖ్యలు చేశాడు.


‘భారత్-పాక్(Ind vs Pak) మ్యాచ్ జరగకున్నా ఫర్వాలేదు. చాలాకాలంగా భారత్, పాక్ మధ్య మ్యాచులు రసవత్తరంగా సాగడం లేదు. పూర్తిగా ఏకపక్షంగా ఫలితాలు వస్తున్నాయి. కారణం.. పాక్ జట్టు 90వ దశకంలో ఉన్నట్టుగా బలంగా లేదు. ఇప్పుడు ఆ టీమ్ చాలా బలహీనంగా ఉంది. అసలు భారత్‌కు పోటీ ఇచ్చే పరిస్థితే లేదు. భారత్ ఆ టీమ్‌తో తలపడుతుంటే.. ఏదో చిన్న జట్టుతో మ్యాచ్ ఆడుతున్న ఫీల్ ఉంటోంది. భారత్-పాక్ పోరు కంటే కూడా టీమిండియాతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతుంటేనే ఉత్కంఠభరితంగా ఉంటోంది’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.


ఇవి కూడా చదవండి:

అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్

అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!

Updated Date - Feb 03 , 2026 | 05:32 PM