డబ్ల్యూపీఎల్ 2026: ఎలిమినేటర్ మ్యాచ్.. టాస్ నెగ్గిన ఢిల్లీ
ABN , Publish Date - Feb 03 , 2026 | 07:14 PM
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 తుది దశకు చేరుకుంది. నేడు గుజరాత్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఎలిమినేటర్ మ్యాచులో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 తుది దశకు చేరుకుంది. నేడు గుజరాత్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఎలిమినేటర్ మ్యాచులో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే ఫైనల్‌కు దూసుకెళ్లింది. నేడు జరిగే ఎలిమినేటర్ మ్యాచు(WPL 2026)లో గెలిచే జట్టు ఫైనల్‌లో ఆర్సీబీతో తలపడనుంది. ఆడిన 8 మ్యాచుల్లో ఐదు గెలిచి రెండో స్థానంలో గుజరాత్ ఉండగా.. నాలుగు మ్యాచులు గెలిచిన ఢిల్లీ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ నుంచి లీగ్ దశలోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
గుజరాత్ జెయింట్స్ తుది జట్టు:
బెత్ మూనీ(వికెట్ కీపర్), సోఫీ డివైన్, అనుష్క శర్మ, గార్డ్‌నర్(కెప్టెన్), జార్జియా వారెహం, భర్తి ఫల్మలి, కనికా అహుజా, కాష్వీ గౌతమ్, తనుజా, రేణుకా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు..
లిజెల్లీ లీ(వికెట్ కీపర్), షఫాలీ వర్మ, లారా వోల్వార్ట్, జెమీమా రోడ్రిగ్స్(కెప్టెన్), కాప్, హెన్రీ, నికీ ప్రసాద్, స్నేహ్ రాణా, మిన్ను మని, శ్రీచరణి, నందని శర్మ
ఇవి కూడా చదవండి:
అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్
అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!