డబ్ల్యూపీఎల్ 2026: యూపీతో మ్యాచ్.. టాస్ గెలిచిన ఢిల్లీ
ABN , Publish Date - Feb 01 , 2026 | 07:29 PM
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-యూపీ వారియర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. లీగ్ స్టేజ్‌లో ఇదే చివరి మ్యాచ్ కాగా.. ఈ ఫలితంలో ప్లే ఆఫ్స్‌లో మూడో బెర్తు ఎవరిదో తేలనుంది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-యూపీ వారియర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. లీగ్ స్టేజ్‌లో ఇదే చివరి మ్యాచ్ కాగా.. ఈ ఫలితంలో ప్లే ఆఫ్స్‌లో మూడో బెర్తు ఎవరిదో తేలనుంది. ప్రస్తుతం ముంబై (6), ఢిల్లీ (6) పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో యూపీ గెలిస్తే ఆ జట్టు కూడా ఆరు పాయింట్లతో ఉంటుంది. అప్పుడు మూడు జట్లలో మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ఇప్పటికే ఆర్సీబీ (12) పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించగా.. గుజరాత్ జెయింట్స్ (10) రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో నిలిచిన జట్టు మంగళవారం గుజరాత్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు..
షెఫాలీ వర్మ, లిజెల్లీ లీ, లారా వోల్వార్ట్, జెమీమా రోడ్రిగ్స్(కెప్టెన్), కాప్, హెన్రీ, నికీ ప్రసాద్, స్నేహ్ రాణా, మిన్ను మని, శ్రీ చరణి, నందని శర్మ
యూపీ వారియర్స్ తుది జట్టు..
మెగ్ లానింగ్(కెప్టెన్), సిమ్రన్ షేక్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, షిప్రా గిరి(వికెట్ కీపర్), డాటిన్, చర్లీ నాట్, సోఫీ ఎకల్‌స్టన్, ఆశా శోభన, శిఖా పాండే, క్రాంతి గౌడ్
ఇవి కూడా చదవండి:
అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ
భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ