నాకౌట్‌కు ఢిల్లీ
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:33 AM
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఎలిమినేటర్‌కు చేరిన రెండో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. ఆదివారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో...
యూపీపై గెలుపు 8 మహిళల ప్రీమియర్ లీగ్
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఎలిమినేటర్‌కు చేరిన రెండో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. ఆదివారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక మంగళవారం గుజరాత్-ఢిల్లీ జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేత ఫైనల్‌కు చేరుతుంది. ముందుగా యూపీ 20 ఓవర్లలో 122/8 స్కోరు సాధించింది. దీప్తి (24), శిఖా (23 నాటౌట్), సిమ్రన్ (22) రాణించారు. మారిజానె కాప్‌నకు మూడు.. శ్రీచరణి, హెన్రీలకు రెండేసి వికెట్లు లభించాయి. స్వల్ప ఛేదనలో కాస్త తడబాటుకు లోనైనా.. ఢిల్లీ 18.4 ఓవర్లలో 126/5 స్కోరు చేసి గెలిచింది. లారా వోల్వార్ట్ (47), కెప్టెన్ జెమీమా (34 నాటౌట్), షఫాలీ (29) కీలకంగా నిలిచారు. దీప్తి శర్మకు రెండు వికెట్లు దక్కాయి. కాప్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ
భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ