Home » Warangal
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ సంపంగి నాగరాజు కశ్మీర్లో విధుల్లో ఉండగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య (army jawan suicide) చేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Konda Surekha: గోరంతలు కొండంతలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. పూర్తి వీడియోలు ప్రసారం చేయకుండా ఎడిటింగ్‌తో తప్పుడు ప్రచారాలు చేసి బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్‌ను కావాలని ట్రోల్ చేస్తున్నారన్నారు.
ప్రపంచ సుందరీమణుల ఓరుగల్లు టూర్ వివాదాస్పదం కావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రామప్పలో అసలు ఏం జరిగింది? అనే దానిపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంటోంది.
సంప్రదాయ చీరకట్టు, నుదుట బొట్టు, జడ కొప్పు, మల్లెపూలు ధరించి.. ప్రపంచ సుందరి పోటీదారులు తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబయ్యారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆట, పాటలతో నృత్యాలు చేశారు.
Miss World Contestants: అందాల భామలు బుధవారం వరంగల్, ములుగు జిల్లాలో పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. 35 మందితో కూడిన సుందరీమణులతో కూడిన ఒక బృందం వరంగల్ నగరంలోని వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తుంది. అలాగే..
Operation Sindoor: కర్రెగుట్టల్లో మావోయిస్టుల వేటకు కాస్త విరామం పడింది. ఆపరేషన్ కగార్‌పై ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పడింది. వెంటనే బార్డర్‌కు వెళ్లాల్సిందిగా సీఆర్పీఎఫ్ బలగాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుత వేసవి సెలవుల రద్దీ నేపధ్యంలో ఈనెల 12వతేదీ నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లలో కొన్ని నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా, మరికొన్ని ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం మీదుగా నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.
Maoists: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నక్సల్స్ తూటాలకు బలైన పోలీసుల అంత్యక్రియలకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు.
వెండి, బుల్లితెర కళాకారుడు గుడిబోయిన బాబు తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు అనారోగ్యంతో మంచంపట్టారు. వైద్యం, మందుల కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు, వరంగల్ రంగస్థల కళాకారుల సంఘం ప్రతినిధులు తెలిపారు.
Seethakka On Operation Kagar: ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని మంత్రి సీతక్క సూచించారు. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నానని తెలిపారు.