Mahabubabad Accident: ఇంట్లోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఒకరు మృతి
ABN , Publish Date - Aug 31 , 2025 | 06:46 AM
హనుమకొండకు చెందిన యువకుడికి ఖమ్మం జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. అయితే.. వరుడికి చెందిన 30 మందికి పైగా బంధువులు ఓ ట్రావెల్ బస్సులో పెళ్లికి వెళ్లారు. వివాహం అనంతరం అదే బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు.
మహబూబాబాద్: పిల్లల అల్లర్లతో.. పెద్దవారి ఆటపాటలతో.. సందడిగా ప్రయాణిస్తున్న ఓ పెళ్లి బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. దంతాలపల్లి మండల కేంద్రంలోని వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారిపై పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఓ ఇంటి ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే.. క్లినర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
హనుమకొండకు చెందిన యువకుడికి ఖమ్మం జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. కాగా, వరుడికి చెందిన 30 మందికి పైగా బంధువులు ఓ ట్రావెల్ బస్సులో పెళ్లికి వెళ్లారు. వివాహం అనంతరం అదే బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో రోడ్డుపై గుంతల కారణంగా బస్సు అదుపుతప్పి దంతాలపల్లి మసీదు సమీపంలోని రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లి ఇంటి గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హనుమకొండకు చెందిన బస్సు డ్రైవర్ దేవేందర్(38) అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ సాయికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
హీరో అసభ్య ప్రవర్తన.. హీరోయిన్‌పై ట్రోలింగ్స్..
జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..