Hyderabad: నడక నేర్చుకున్న రాహుల్
ABN , Publish Date - Sep 18 , 2025 | 08:05 AM
రాజస్థాన్‌లో రైలులో వెళ్తుండగా దుండగులు దాడి చేసి రైలులోని అత్యవసర ద్వారం నుంచి కిందకు విసిరేయడంతో రెండు కాళ్లు కోల్పోయిన వరంగల్ జిల్లా హన్మకొండ దామెర మండలం నివాసి గుండెటి రాహుల్ కృత్రిమ కాళ్లతో చకచక అడుగులు వేస్తున్నారు.
- దుండగుల దాడిలో కాళ్లు కోల్పోయిన విద్యార్థి
- నిమ్స్‌లో కృత్రిమ కాళ్లు ఏర్పాటు
హైదరాబాద్ సిటీ: రాజస్థాన్‌లో రైలులో వెళ్తుండగా దుండగులు దాడి చేసి రైలులోని అత్యవసర ద్వారం నుంచి కిందకు విసిరేయడంతో రెండు కాళ్లు కోల్పోయిన వరంగల్ జిల్లా హన్మకొండ(Hanmakonda) దామెర మండలం నివాసి గుండెటి రాహుల్ కృత్రిమ కాళ్లతో చకచక అడుగులు వేస్తున్నారు. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు కృత్రిమ అవయవాలు అమర్చారు. వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వడంతో ఆ విద్యార్థి మునుపటి మాదిరిగానే నడుస్తున్నాడు.
నడవడం, కూర్చోవడం, సులభంగా ఉండే ఆధునిక కృత్రిక కాళ్లను అమర్చారు. బుధవారం నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప, తనకు సహకరించిన వైద్యులను కలిసి ఆ విద్యార్థి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి, సహకారం అందించనందుకు కృతజ్ఞతలు తెలిపిన విషయం విదితమే. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.10 లక్షల విలువ చేసే ఈ అత్యాధునిక కృత్రిమ అవయవాలను పూర్తిగా ఉచితంగా అందించారు.
రాహుల్(Rahul) తన చదువులు కొనసాగించేందుకు, సాధారణ జీవితాన్ని గడపేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప వివరించారు. ఈ సందర్భంగా రాహుల్‌కు శస్త్రచికిత్స చేసిన ఆర్థోపెడిక్ వైద్య బృందాన్ని చంద్రశేఖర్, ఆసిఫ్, లలిత్, సందీ్‌పలను అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే
Read Latest Telangana News and National News