Home » Warangal
మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేదని మాజీ మంత్రి అన్నారు. వరంగల్, కరీంనగర్‌లో మంత్రులు మంత్రులే కొట్టుకుంటున్నారని తెలిపారు.
కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొడతామని స్పష్టం చేశారు. ప్రజలకు ఉన్న బాకీ కార్డుతో గుర్తు చేస్తే... ధోకా కార్డును తెరపైకి తెస్తున్నారని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. అమలు కానీ హామీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపణలు గుప్పించారు.
బీఆర్ఎస్ గతంలో హామీలు ఇచ్చి అమలు చేయని పనులతో ఢోఖా కార్డును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ కడియం కావ్య, నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ఆర్‌ఆర్ టాక్స్ నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. పోలీసులు బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే పింక్ బుక్‌లో రాసుకుంటామని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ పోలీసుల పని పడతామని హెచ్చరించారు.
సుప్రీంకోర్టులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల ట్రైబల్ కేసుపై మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసుపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.
నగర జీవితంలో ట్రాఫిక్ జామ్‌లు, మాల్స్ హడావిడి, మొబైల్ స్క్రీన్‌లతో గందరగోళంతో ఉన్నారా. ఈ దసరా సెలవుల్లో ప్రకృతి ఒడిలోకి చేరుకుని ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. అందుకోసం హైదరాబాద్ నుంచి 5 గంటల దూరంలో చక్కటి ప్లేస్ ఉంది. అది ఏంటి, ఎలా వెళ్లాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
మేడారం మూలాలను కాపాడుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివాసీల మనోభావాలకు తగినట్టుగా గద్దెల మార్పులు చేస్తున్నామని చెప్పారు. పూజారులతో మరోసారి సీఎం చర్చించి డిజైన్‌లు ఫైనల్ చేస్తారని వెల్లడించారు.
కొత్త ఠాణాలు, ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్ల ఏర్పాటు కాగితాలకే పరిమితమవుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో కొత్తగా ఠాణాల ప్రతిపాదనలు మూలుగుతున్నాయి. కొత్త జిల్లాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినా ఫలితం లేకుండా పోతోంది.
రాజస్థాన్‌లో రైలులో వెళ్తుండగా దుండగులు దాడి చేసి రైలులోని అత్యవసర ద్వారం నుంచి కిందకు విసిరేయడంతో రెండు కాళ్లు కోల్పోయిన వరంగల్ జిల్లా హన్మకొండ దామెర మండలం నివాసి గుండెటి రాహుల్ కృత్రిమ కాళ్లతో చకచక అడుగులు వేస్తున్నారు.
ప్రసాద్ భార్య రష్మితకు కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారానికి భర్త ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని, అతడిని చంపాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.