Share News

మేడారం ఎఫెక్ట్.. బెల్లం కొనుగోళ్లు ముమ్మరం

ABN , Publish Date - Jan 22 , 2026 | 01:36 PM

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తేదీ దగ్గర పడుతుండడంతో గ్రామాలు, పట్టణాల్లో బెల్లం కొనుగోళ్లు ముమ్మరం జరుగుతున్నాయి. ఈనెల 28,29,30,31 తేదీల్లో మహాజాతర జరుగుతున్నతన విషయం తెలిసిందే. అయితే.. బంగారంగా పలిచుకునే బెల్లం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

మేడారం ఎఫెక్ట్.. బెల్లం కొనుగోళ్లు ముమ్మరం

- సమ్మక్క-సారలమ్మ జాతరకు సిద్ధమవుతున్న భక్తులు

వెంకటాపూర్‌(ములుగు): గిరిజన ఆదివాసీ జాతర సమ్మక్క-సారలమ్మ(Sammakka-Saralamma) వనదేవతల జాతరకు అన్నీ సిద్ధమవుతున్నాయి. జాతర సమయం సమీపిస్తున్నకొద్దీ అధికార యంత్రాంగం భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రెండేళ్లకోసారి నిర్వహించే జాతర వేడుకలు మాఘశుద్ధ పౌర్ణమికి ముందు నాలుగురోజులపాటు సమ్మక్క-సారలమ్మ జాతరను భక్తులు కోలాహలంగా జరుపుకుంటారు. పేరుకే గిరిజన జాతర అయినప్పటికీ అన్నివర్గాలకు చెందిన భక్తులు భక్తిశ్రద్ధలతో వనదేవతలకు పూజలు చేస్తారు.


vvvv.jpg

ఈనెల 28నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా తల్లులను దర్శించి మొక్కులు చెల్లించడానికి భక్తజనం సిద్ధమవుతున్నారు. వనదేవతలకు బెల్లం(బంగారం) కొనుగోలు చేసి భక్తులు పంచిపెడుతున్నారు. దీంతో బెల్లందుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మార్కెట్లో 10కిలోల బెల్లంముద్దలు రూ.50 కిలో అయితే రూ.55వరకు అమ్మకాలు కొనసాగుతున్నాయి.


zzzzzzzz.jfif

చక్కెర కిలో రూ.43కు లభిస్తుంది. బెల్లం పంచిపెట్టని వారు కొందరు చక్కెరను కూడా పంచిపెడుతున్నారు. మహాజాతర సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఈ సీజన్‌లో బెల్లం, చక్కెర, మేకలు, కోళ్లు, మద్యం, వాహనాల అద్దెలు, కొబ్బరికాయలు, తదితర వ్యాపారాలపై దాదాపు రూ.20కోట్లకుపైగానే ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పెంపుడు కుక్కకు.. మేడారంలో తులాభారం! క్షమాపణలు చెప్పిన.. హీరోయిన్‌

పాలిచ్చే పశువులకు చికెన్‌, మటన్‌ వ్యర్థాలు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 22 , 2026 | 01:44 PM