కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు..
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:28 PM
మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదంటూ ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలంలేదని రాష్ట్ర మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar Rao) అన్నారు. సోమవారం వర్ధన్నపేట మున్సిపలిటి 10 డివిజన్ మాజీ కౌన్సిలర్ తుమ్మల రవీందర్ సహా మరో 50మంది బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి దయాకర్‌రావు బిఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా కేసిఆర్ వైపు చూస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండ ప్రజలలో విశ్వాసం కోల్పోతుందన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీ వైపు చూస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రేండేళ్లు గడిచిన్పటికి వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మున్సిపల్ ఎన్నికల ముందు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడం విడ్డురంగా ఉందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన గుణపాఠం చెప్పుతారని అన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో చేసిన అభివృద్ది పనులే కనిపిస్తున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఒక్కటి లేదని ఎం మోహంతో ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ఎద్దెవా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గోధుమల మధు, వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ చింతల యాదగిరి, మండల అధ్యక్షడు తూళ్ల కుమారస్వామి, మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి, మాజీ ఎంపిపి అప్పారావు, సిలువేరు కుమారస్వామి, తుమ్మల యాకయ్య, వార్డుల ఇంచార్జీలు, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
హింసను ప్రశ్నించినా బెదిరింపులే!
Read Latest Telangana News and National News