మార్బుల్స్ దించుతుండగా ఊహించని ప్రమాదం
ABN , Publish Date - Jan 24 , 2026 | 10:37 AM
మార్బుల్స్ దించుతుండగా మీద పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
మహబూబాబాద్, జనవరి 24: గార్ల మండలం బంగ్లాతండాలో విషాదం చోటు చేసుకుంది. మార్బుల్స్ దించుతుండగా ప్రమాదవశాత్తూ మీద పడి ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారు బంగ్లాతండాకు చెందిన తరుణ్ (27), ఖమ్మం జిల్లా కామేపల్లి మండలానికి చెందిన అవినాష్ (29)గా గుర్తించారు. ఇద్దరూ మార్బుల్ రాళ్లను లోడ్/అన్‌లోడ్ చేస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు. యువకుల మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. పని కోసం వెళ్లిన తమ కుమారులు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో వారి స్వగ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
నేటి నుంచి షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్
4 రోజులు 45 భేటీలు.. లోకేశ్ దావోస్ టూర్ సక్సెస్
Read Latest AP News And Telugu News