సార్... నాకు అద్దె వద్దు
ABN , Publish Date - Jan 24 , 2026 | 08:13 AM
సార్... నాకు అద్దె వద్దు.. ఉచితంగానే మీకు భవనం ఇస్తా.. కార్యాలయాన్ని మాత్రం మార్చకండి.. అంటూ ఓ భవనం యజమాని సంబంధఇత అధికారులకు లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చాడు. కార్యాలయాన్ని ఇక్కడినుంచి తరలిస్తే.. మా గ్రామం కళ పోతుందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి.
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించొద్దని వేడుకోలు
- గండిపేట రిజిస్ట్రార్‌కు ఇంటి యజమాని లేఖ
హైదరాబాద్: ‘సార్.. నాకు అద్దె ఏమీ చెల్లించకండి.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇక్కడినుంచి తరలించకండి. కార్యాలయాన్ని తరలిస్తే గ్రామం కళ తప్పిపోతుంది..’ అంటూ కార్యాలయ భవన యజమాని ఓ లేఖను సబ్‌రిజిస్ట్రార్‌కు అందజేశారు. ఈ విచిత్ర ఘటన నార్సింగ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం అద్దెల భారం తగ్గించుకునే ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా గండిపేట, శేర్‌లింగంపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను గచ్చిబౌలి(Gachibowli)లోని టీహబ్‌కు మారుస్తూ జీవో జారీ చేసింది.
ప్రస్తుతం గండిపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నార్సింగ్(Narsing)లోని ఓ అద్దె భవనంలో కొనసాగుతూ వస్తుంది. దీని తరలింపునకు రంగం సిద్ధం కావడంతో సదరు ఇంటి యజమాని విజయ్‌రాజ్ ఇలా లేఖ రాశారు.
ఈ వార్తలు కూడా చదవండి
మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..
జగన్ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత
Read Latest Telangana News and National News