Home » Visaka
విశాఖపట్నం గాజువాకలో ఘోర ప్రమాదం జరిగింది. తుంగ్లం దగ్గర రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.
అరిదమన్ అనేది ఒక పదం కాదని.. ఒక శక్తి అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. శుక్రవారం విశాఖపట్నంలో భారత్ తన మూడో స్వదేశీ అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్‌ను ఆయన నౌకాదళంలో ప్రవేశపెట్టారు.
రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల పాలకవర్గ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పలు కార్పొరేషన్ల మేయర్లు స్పందించారు.
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌కు, వైసీపీ నేతలకు హిందువులన్నా, హిందూ మతమన్నా గౌరవం లేదని.. ఆలయాలపై దాడి జరిగినా మిన్నకుండిపోయారని వ్యాఖ్యానించారు.
దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలకపాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. సముద్ర వాణిజ్యంలో సైతం నేవీ సుస్థిరత తీసుకొచ్చిందని పేర్కొన్నారు. విశాఖపట్నం తీరం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) బుధవారం ప్రారంభమైంది.
ఎరుపు రంగు చదరంలో ఉన్నది 1986లో ‘ఆంధ్రజ్యోతి’కి అప్పటి ప్రభుత్వం కేటాయించిన స్థలం. ఇందులో... హైవేను ఆనుకుని ఉన్న 74 సెంట్లను బఫర్ జోన్ కోసం ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది......
విశాఖపట్నం జగదాంబ సెంటర్‌లో మహిళపై ఒక వ్యక్తి దాడి చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు.
చంద్రబాబు సారథ్యంలో కొలువు తీరిన కూటమి ప్రభుతానికి ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తితే.. ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటుకు క్యూ కట్టాయి.
విశాఖ సీఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లోనే రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించగలిగిందని పేర్కొన్నారు. విశాఖ వేదికగా రెండ్రోజులపాటు జరిగిన సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాలు జరిగాయని.. వీటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు.
ఈనెల 14, 15 తేదీల్లో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ వేదికగా సీఐఐ సదస్సు జరగనుంది. అయితే, ఈ సదస్సు ప్రారంభం కావడానికి ముందే ఏపీ సర్కార్ రికార్డుల మోత మోగిస్తోంది.