AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న మూడు గంటలు జాగ్రత్త...
ABN , Publish Date - Oct 05 , 2025 | 06:25 PM
కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు గంటల పాటు పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక ఉన్నట్లు తెలిపింది. అలాగే పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మోస్తరు వర్షంతోపాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవ్వరూ చెట్ల కింద ఉండరాదని సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. దూర ప్రయాణాలు రద్దు చేసుకుని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని వివరంచారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎండీ ప్రఖర్ జైన్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు