Share News

PVN Madhav: అక్టోబరు 2న రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంత..

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:05 PM

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.

PVN Madhav: అక్టోబరు 2న రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంత..
PVN Madhav

విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేది వరకు నగరంలో సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సేవా పక్షోత్సవాలలో భాగంగా.. ప్రధాని పేరు మీద వివిధ కార్యక్రమాలను బీజేపీ నాయకులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ(శనివారం) బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..


ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు మాధవ్ తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. యువత, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేశారని పేర్కొన్నారు. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి మాధవ్ అభినందనలు తెలిపారు.


అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతను నిర్వహిస్తున్నట్లు మాధవ్ తెలిపారు. ఖాదీ సంత ద్వారా స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. చేనేత కార్మికులను, వృత్తులను కాపాడుకోవాలన్నారు. ఖాదీ సంత ద్వారా గాంధీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామని ఉద్ఘాటించారు. ఖాదీ వస్త్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ఘనత మహాత్మా గాంధీదని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్నదే గాంధీ లక్ష్యమన్నారు. ఈ క్రమంలో గ్రామ స్వరాజ్యమే నినాదం కావాలని మాధవ్ పిలపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా

Updated Date - Sep 20 , 2025 | 01:45 PM