AP Rain Alert: బలపడిన అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన..
ABN , Publish Date - Sep 13 , 2025 | 06:13 PM
అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాను అనుకొని అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపారు. సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. పశ్చిమ మధ్య తీరానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు స్పష్టం చేశారు.
అల్పపీడనం ప్రభావంతో.. ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
మణిపూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని