Share News

Minister Sandhyarani: కురుపాం విద్యార్థినిలకు మంత్రి సంధ్యారాణి పరామర్శ..

ABN , Publish Date - Oct 05 , 2025 | 06:54 PM

కేజీహెచ్‌లో 37 మంది బాలికలకు మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. బాలికలు జాండీస్, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు.

Minister Sandhyarani: కురుపాం విద్యార్థినిలకు మంత్రి సంధ్యారాణి పరామర్శ..
Minister Gummadi Sandhyarani

విశాఖపట్నం: అస్వస్థత గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం బాలికల పాఠశాల విద్యార్థులను మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాలికల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.. కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో 129 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారని తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో 37 మంది బాలికలను మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌లో చేర్పించినట్లు స్పష్టం చేశారు.


కేజీహెచ్‌లో 37 మంది బాలికలకు మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. బాలికలు జాండీస్, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. మిగిలిన బాలికలు పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె వెల్లడించారు. బాలికల ఆరోగ్య విషయంలో ప్రభుత్వం ప్రత్యక శ్రద్ధ తీసుకుంటుందని వివరించారు. పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్థినిలు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. పాఠశాలలోని పరిసరాలన్నీ పరిశుభ్రంగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు.


బాలికల సౌకర్యార్థం పాఠశాలలో నూతనంగా 40 టాయిలెట్స్ నిర్మిస్తున్నట్లు సంధ్యారాణి తెలిపారు. గిరిజన ప్రాంతాలలో అన్ని పాఠశాలల్లో ఏఎన్ఎంలు ఉన్నారని పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గిరిజన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం విద్యార్థులకు ఒక ప్లేట్ కూడా ఇవ్వలేదని మంత్రి ఆరోపించారు. గిరిజన ప్రాంతాలలో వాతావరణం మారడం వలన ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారని చెప్పారు. పిల్లలు పండగలకు వెళ్లివచ్చిన తరువాత కొంత మేర అస్వస్థతకు గురవుతుంటారని వివరించారు. బాలికలు అస్వస్థతకు గురికావడంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఎవరి తప్పిదమైనా ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Updated Date - Oct 05 , 2025 | 08:33 PM