Share News

Air India Flight incident: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - Sep 18 , 2025 | 05:33 PM

అప్రమత్తమైన పైలట్‌ ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని తక్షణమే వెనక్కి మళ్లించి విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. పైలట్ సమయానికి చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో ఉన్న 103 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Air India Flight incident: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి తప్పిన పెను ప్రమాదం
Air India Flight incident

ఇంటర్నెట్ డెస్క్: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి ఇవాళ(గురువారం) మధ్యాహ్నం 2:20 గంటలకు ఎయిరిండియా విమానం హైదరాబాద్‌‌కు బయలుదేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన తర్వాత రెక్కల్లో పక్షి ఇరుక్కోవడంతో ఇంజన్‌ ఫ్యాన్‌ రెక్కలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.


వెంటనే అప్రమత్తమైన పైలట్‌ ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని తక్షణమే వెనక్కి మళ్లించి విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. పైలట్ సమయానికి చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో ఉన్న 103 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా, అప్పటివరకూ తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు.. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి..

ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్‌ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్‌ ఆగ్రహం

చారిత్రాత్మక జీఎస్టీ సంస్కరణలకు ఏపీ తొలి మద్దతుదారు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 06:05 PM