Share News

CM Chandrababu Naidu: టెక్నాలజీకి అనుగుణంగా.. మనం మారాలి..

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:37 AM

రాబోయే రోజుల్లో నాలెడ్జ్‌ ఎకానమీనే మనల్ని నడిపించబోతోందని చంద్రబాబు వ్యాఖ్యనించారు. సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నయినా చేయవచ్చు అని ధీమా వ్యక్తం చేశారు.

CM Chandrababu Naidu: టెక్నాలజీకి అనుగుణంగా..  మనం మారాలి..
CM Chandrababu Naidu

విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం రాబోయే పదేళ్లలో కొత్తమలుపు తీసుకోబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఐటీలో హైదరాబాద్‌ను అగ్రగామిగా మార్చామని గుర్తు చేశారు. ప్రపంచంలోనే ఎక్కువ సంపాదిస్తున్నది తెలుగువారే అని హర్షం వ్యక్తం చేశారు. పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌లో టాప్‌ తెలుగు వారే ఉన్నారని స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన జాతీయ ఈ-గవర్నెన్స్‌ సదస్సులో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు..


రాబోయే రోజుల్లో నాలెడ్జ్‌ ఎకానమీనే మనల్ని నడిపించబోతోందని చంద్రబాబు వ్యాఖ్యనించారు. సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నైనా చేయవచ్చు అని ధీమా వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నాయకుడిగా ప్రధాని మోదీ దేశానికి వచ్చారని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే నూతన సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. టెక్నాలజీకి అనుగుణంగా మనం మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. ఇవాళ ప్రజలకు అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వచ్చాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

జమ్ము సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్ కదలికలు..బీఎస్ఎఫ్ గాలింపు చర్యలు

GST Rate Cut: జీఎస్టీ జోష్‌

Updated Date - Sep 22 , 2025 | 11:39 AM