Home » Virat Kohli
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమవ్వాలని కొంతమంది కోరుకున్నారని, వారు రిటైర్మెంట్ ప్రకటించాలని భావించారని, అందుకే పలు రకాల విమర్శలు చేస్తున్నారని డివిలియర్స్ తెలిపాడు.
కానీ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం.. అద్భుత ప్రదర్శన చేయడం మాత్రం అభిమానులకు జోష్ తెప్పించింది. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న ఈ ఇద్దరి బ్యాటింగ్‌ను చూసి సిడ్నీ ప్రేక్షకులు కూడా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. రో-కో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడు..?
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ( 121*)సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(74*) అర్ధ శతకంతో రాణించాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా ఆసీస్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ గిల్ అన్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్,స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ శనివారం (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో అద్భుత సెంచరీ(121*) చేశాడు. ఇక రోహిత్ శర్మ సెంచరీపై కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. పెర్త్, అడిలైడ్ మ్యాచ్ లో డకౌటైన కోహ్లీ .. సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో మాత్రం ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
కోహ్లీకి అక్టోబర్ 25 అస్సలు కలిసి రాదనే రికార్డు ఉంది. తన కెరీర్‌లో ఈ తేదీన ఆడిన వన్డేల్లో కోహ్లీ అత్యధిక స్కోర్ 30 పరుగులే. ఈ నేపథ్యంలో సిడ్నీలో ఈ ప్రతికూల రికార్డును కోహ్లీ ఎలా అధిగమిస్తామనేది ఆసక్తికరంగా మారింది..
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే ఈ రోజు (శనివారం) జరగబోతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది. ఇక, క్లీన్ స్వీప్ అవమానం నుంచి తప్పించుకోవడం ఒకటే ఇప్పుడు టీమిండియా ముందున్న లక్ష్యం.
వరుసగా రెండు మ్యాచుల్లోనూ డకౌట్ కావడంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇక విరాట్ రిటైర్మెంట్‌కు వేళైందా? అనే సందేహాలూ అభిమానుల్లో వస్తున్నాయి.
గురువారం ఆస్ట్రేలియాతో భారత్ అడిలైడ్ వేదికగా రెండో వన్డే ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. అతను జీరో పరుగులు చేసినా ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ లభించింది. అతడు డకౌట్ అయినా.. ప్రేక్షకులంతా కింగ్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాల్గొంటున్నారు. అయితే పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు.