Share News

Virat Kohli Targets: 2026లో విరాట్‌ను ఊరిస్తున్న మూడు రికార్డులు..

ABN , Publish Date - Jan 02 , 2026 | 01:12 PM

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని 2026 సంవత్సరంలో మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. అతడు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అజేయ హాఫ్‌ సెంచరీతో సత్తా చాటి...2025ను ఘనంగా ముగించాడు.

Virat Kohli Targets: 2026లో విరాట్‌ను ఊరిస్తున్న మూడు రికార్డులు..
Virat Kohli 2026 records

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి 2025 సంవత్సరం ఒక చిరస్మరణీయమైనది. ఐపీఎల్ సీజన్18లో అతను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలానే ఐపీఎల్ కప్ ను ముద్దాడాలనే ఆర్సీబీ ఏళ్ల కల.. 2025లో నెరవేరింది. కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ తమ తొలి టైటిల్‌ను గెలుచుకుంది. అలానే విరాట్ భారత్ తరఫున వన్డేలలో అత్యధిక పరుగులు కూడా చేసి, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటర్లలో రెండవ స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా, వన్డేలలో రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఒకే అంతర్జాతీయ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం వంటి ఘనతలు కూడా 2025 ఏడాదిలో సాధించాడు. అలానే 2026 సంవత్సరంలో విరాట్‌ కోహ్లీని (Virat Kohli)ని మూడు రికార్డ్‌లు ఊరిస్తున్నాయి.


రికార్డ్-1

విరాట్‌ కోహ్లీ ఐపీఎల్‌లో (IPL) మరో 339 పరుగులు చేస్తే.. ఈ లీగ్‌లో 9,000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. ప్రస్తుతం విరాట్ ఐపీఎల్ లో 259 ఇన్నింగ్స్‌ల్లో 8,681 పరుగులు చేసి.. టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి తర్వాత రోహిత్ శర్మ 267 ఇన్నింగ్స్‌ల్లో 7,046 రన్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్‌ కోహ్లీ తన ఐపీఎల్‌ కెరీర్‌లో మొదటినుంచి ఇప్పటి వరకు కేవలం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పలు సీజన్లలో కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.

రికార్డ్-2

విరాట్‌ కోహ్లీ(Virat Kohli) వన్డేల్లో మరో 443 పరుగులు చేస్తే 15,000 మైలురాయిని చేరుకుంటాడు. ప్రస్తుతం అతను 296 ఇన్నింగ్స్‌ల్లో 14,557 పరుగులు చేశాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఆయన 452 ఇన్నింగ్స్‌ల్లో 18,426 పరుగులు చేశాడు. ఇప్పటివరకు సచిన్‌ ఒక్కరే వన్డేల్లో 15,000కు పైగా పరుగులు చేశారు.


రికార్డ్-3

న్యూజిలాండ్‌, టీమిండియా మధ్య జనవరి 11న తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ఓ రికార్డ్‌ సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 623 ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులు చేశాడు. మరో 42 పరుగులు చేస్తే.. శ్రీలంక మాజీ క్రికెటర్‌ కుమార సంగక్కరను (28,016 పరుగులు) అధిగమిస్తాడు. అప్పుడు కోహ్లీ ఇంటర్నెషనల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డ్‌ సృష్టిస్తాడు. తొలి స్థానంలో సచిన్ టెండుల్కర్ 34,357 పరుగులతో టాప్ లో ఉన్నారు

విరాట్ కోహ్లీ కెరీర్ చివరి దశలో..

కోహ్లీ(Virat Kohli)కి ఈ ఏడాదిలో 38 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలో అతను ఇంకెంత కాలం ఆడతాడో చూడాలి. 2027 వన్డే ప్రపంచ కప్ అతని తదుపరి లక్ష్యంగా ఉంది. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడే జట్టులో స్థానం నిలబెట్టుకునేందుకు అతను కాలంతో పోటీ పడాల్సి వస్తోంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. కోహ్లీ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పుడు, క్రికెట్ చరిత్రలో అతడి ఆట ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుంది. అతడు సాధించిన పలు రికార్డులను బ్రేక్ చేయడం అంత ఈజీ కాదని క్రీడా నిపుణులు చెబుతున్నారు.



ఇవి కూడా చదవండి:

Palestine Flag Controversy: హెల్మెట్‌పై 'పాలస్తీనా జెండా' ధరించిన కశ్మీర్‌ క్రికెటర్‌

Jason Gillespie: పీసీబీ అవమానించింది.. అందుకే రాజీనామా: పాక్ మాజీ కోచ్ జేసన్ గిలెస్పీ

Rishabh Pant: 3, 4 తేదీల్లో టీమిండియా ఎంపిక

Updated Date - Jan 02 , 2026 | 03:01 PM