Rishabh Pant: 3, 4 తేదీల్లో టీమిండియా ఎంపిక
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:56 AM
న్యూజిలాండ్‌తో సిరీస్ ద్వారా కొత్త సంవత్సరంలో క్రికెట్‌కు భారత జట్టు ఆహ్వానం పలుకుతోంది. సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లలో భారత్-కివీ్‌స తలపడనున్నాయి...
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో సిరీస్ ద్వారా కొత్త సంవత్సరంలో క్రికెట్‌కు భారత జట్టు ఆహ్వానం పలుకుతోంది. సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లలో భారత్-కివీ్‌స తలపడనున్నాయి. ఈనెల 11న రాయ్‌పూర్‌లో జరిగే మొదటి వన్డేతో నూతన సంవత్సరంలో పురుషుల క్రికెట్ సందడి ప్రారంభం కానుంది. అయితే న్యూజిలాండ్‌తో పొట్టి ఫార్మాట్‌కు టీమిండియాను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ వన్డేలకు మాత్రం జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో ఈనెల మూడు లేదా నాలుగు తేదీల్లో ఆన్‌లైన్‌లో సమావేశం కానున్న సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేయనున్నట్టు తెలిసింది.
పంత్‌కు చోటు ఉంటుందా ?
న్యూజిలాండ్‌తో వన్డేలకు ప్రకటించే జట్టులో కీపర్ పంత్‌కు స్థానం ఉంటుందా..అనే విషయమై చర్చ జరుగుతోంది. కారణం..ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రిషభ్ కేవలం ఒక హాఫ్ సెంచరీ చేయడమే. దాంతో పంత్‌కు జాతీయ జట్టులో చోటుపై చర్చ మొదలైంది. అయితే 18 నెలల్లో ఒక వన్డే కూడా ఆడే అవకాశం ఇవ్వకుండా పంత్‌పై వేటు వేయరనే వాదన కూడా వినవస్తోంది. కాగా..పంత్ ధనాధన్ బ్యాటింగ్.. టీమ్ మేనేజ్‌మెంట్‌లోని ఓ ముఖ్యుడికి నచ్చడంలేదట. వన్డేలకు సంప్రదాయ బ్యాటింగ్ చేయడమే ఉత్తమమని సదరు సభ్యుడు అభిప్రాయపడుతున్నట్టు చెబుతున్నారు.