Share News

Jason Gillespie: పీసీబీ అవమానించింది.. అందుకే రాజీనామా: పాక్ మాజీ కోచ్ జేసన్ గిలెస్పీ

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:08 PM

తరచూ పాకిస్థాన్ హెడ్‌కోచ్‌లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. సెలక్టర్లు, మెంటార్లు, సహాయక సిబ్బంది విషయంలో కూడా తరచూ మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు మాజీ టెస్ట్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ జేసన్ గిలెస్పీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

Jason Gillespie: పీసీబీ అవమానించింది.. అందుకే రాజీనామా: పాక్ మాజీ కోచ్ జేసన్ గిలెస్పీ
Jason Gillespie

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ దేశ పరిస్థితిలాగానే అక్కడి క్రికెట్‌లో కూడా అనిశ్చితి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తరచూ పాక్ జట్టు హెడ్‌కోచ్‌లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. సెలక్టర్లు, మెంటార్లు, సహాయక సిబ్బంది విషయంలో కూడా తరచూ మార్పులు జరుగుతుంటాయి. తాజాగా టెస్టు హెడ్‌కోచ్‌ అజహర్‌ మహమ్మద్‌కు పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు మాజీ టెస్ట్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ జేసన్ గిలెస్పీ(Jason Gillespie) తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.


జేసన్‌ గిలెస్పీ (Jason Gillespie) 2024లో పాకిస్థాన్‌ కోచ్‌గా పనిచేశాడు. అయితే అతడు అకస్మాత్తుగా తన పదవి నుంచి తప్పుకున్నాడు. దానికి గల కారణాన్ని తాజాగా అజహర్‌ మహమ్మద్‌ ను తొలగించిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘మీరు పాకిస్థాన్‌ కోచ్‌గా ఎందుకు తప్పుకొన్నారు’ అని ‘ఎక్స్‌’ వేదికగా ఓ యూజర్‌ గిలేస్పీని అడిగారు. దానికి అతడు సమాధానమిస్తూ.. ‘ 2024 టైమ్లో నేను పాకిస్థాన్‌ టెస్టు జట్టుకు కోచింగ్‌ ఇచ్చేవాడిని. అయితే ఆ సమయంలో నాకు తెలియకుండానే.. నలుగురు అసిస్టెంట్‌ కోచ్‌లను(PCB coaching changes) పీసీబీ తొలగించింది. హెడ్‌కోచ్‌గా నాకిది అస్సలు నచ్చలేదు. అది పరోక్షంగా నన్ను అవమానించడమే. ఇవే కాదు ఇలాంటి ఘటనలు ఇంకెన్నో జరిగాయి. పీసీబీ తీరు నన్ను కించపరిచే విధంగా, అవమాపరిచేలా ఉండటం ఎంతో బాధించింది. వీటితో పాటు పలు కారణాలతో హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాను’ అని జేసన్‌ గిలెస్పీ చెప్పుకొచ్చారు.


గతంలో గిలెస్పీ(Jason Gillespie) పీసీబీ చీఫ్, ఏసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై పరోక్ష విమర్శలు చేశాడు. పాకిస్థాన్ జట్టుతో అనుబంధం పెంచేందుకు ఏర్పాటుచేసిన ‘కనెక్షన్ క్యాంప్’కు గ్యారీ కిర్‌స్టెన్ దక్షిణాఫ్రికా నుంచి స్వయంగా వచ్చారని, తాను ఆస్ట్రేలియా నుంచి వచ్చానని, అయితే లాహోర్‌లోనే ఉన్న నఖ్వీ మాత్రం ప్రత్యక్షంగా హాజరుకాకుండా జూమ్ ద్వారా మాత్రమే పాల్గొన్నారని చెప్పాడు. ఇది గ్యారీతో పాటు తనకు ఆశ్చర్యం కలిగించిందని గిలెస్పీ వెల్లడించాడు.



ఇవి కూడ చదవండి:

Palestine Flag Controversy: హెల్మెట్‌పై 'పాలస్తీనా జెండా' ధరించిన కశ్మీర్‌ క్రికెటర్‌

Rishabh Pant: 3, 4 తేదీల్లో టీమిండియా ఎంపిక

Updated Date - Jan 02 , 2026 | 01:04 PM