Vijay Hazare Trophy: మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?
ABN , Publish Date - Dec 29 , 2025 | 10:35 AM
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రెండు మ్యాచులు ఆడిన సంగతి తెలిసిందే. అయితే నేడు జరుగుతున్న మూడో రౌండ్‌కు వీరిద్దరూ అందుబాటులో లేరు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రోహిత్ ముంబై తరఫున ఆడబోడు. కారణాలు ఏంటంటే..?
ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ అభిమానులకు విందు భోజనాన్ని వడ్డిస్తోంది. టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతుండటంతో ఈ టోర్నీకి ఎనలేని ఆదరణ ఏర్పడింది. అభిమానుల కోసమే అన్నట్లు రో-కో కూడా అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తున్నారు. అయితే ఇక్కడ ఓ నిరాశ మొదలైంది. మూడో రౌండ్(Vijay Hazare Trophy)లో రో-కో అందుబాటులో లేరు! సోమవారం ఇప్పటికే మొదలైన ఆటలో ఢిల్లీ తరఫు కోహ్లీ, ముంబై తరఫున రోహిత్ శర్మ బరిలోకి దిగలేదు ఎందుకంటే..?
బెంగుళూరులోని ఆలూరు గ్రౌండ్‌లో ఢిల్లీ- సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆడటం లేదు. దీనికి ప్రధాన కారణం వ్యక్తిగత విరామం. మొదటి రెండు మ్యాచ్‌లలో సత్తా చాటిన కోహ్లీ, ప్రస్తుతానికి జట్టును వీడి ముంబైకి వెళ్లాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల ఒత్తిడి, రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయనకు ఈ విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
జైపూర్‌లోని జైపురియా విద్యాలయ గ్రౌండ్‌లో ఛత్తీస్‌గఢ్‌తో ముంబై తలపడుతోంది. రోహిత్ శర్మ(Rohit Sharma) కేవలం రెండు మ్యాచులే ఆడతాడని ముందే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి రెండు మ్యాచుల్లో రాణించిన రోహిత్.. అంతర్జాతీయ మ్యాచులకు సిద్ధమవుతున్నవాడు. ఇక ముంబై తరఫున హిట్‌మ్యాన్ విజయ్ హజారేలో ఆడడని స్పష్టమైంది.
ప్రదర్శనలు ఇలా..
ఢిల్లీ తరఫున ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఒక మ్యాచ్‌లో 131 పరుగులతో మెరిసిన విరాట్.. మరో మ్యాచ్‌లో 77 పరుగులు చేశాడు. మరోవైపు రోహిత్ శర్మ ముంబై తరఫున తొలి మ్యాచ్‌లో భారీ 155 పరుగులతో చెలరేగగా, ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
ఇవి కూడా చదవండి
వన్డే సిరీస్.. కీలక ప్లేయర్లు దూరం!
ఏ పదాన్ని తీసేస్తారో చూడాలి.. మెల్‌బోర్న్ పిచ్‌పై గావస్కర్ కీలక వ్యాఖ్యలు