Sunil Gavaskar: ఏ పదాన్ని తీసేస్తారో చూడాలి.. మెల్‌బోర్న్ పిచ్‌పై గావస్కర్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 29 , 2025 | 09:38 AM
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. అయితే మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఒకే రోజు 20 వికెట్లు పడ్డాయి. దీంతో పిచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్ 2025లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. తొలి మూడు మ్యాచుల్లోనూ ఓడిన ఇంగ్లండ్.. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయింది. తమ సొంత గడ్డపై తిరుగులేని జట్టుగా ఆస్ట్రేలియా విజయభేరి కొనసాగిస్తూ.. సిరీస్‌ను దక్కించుకుంది. అయితే ఆసీస్‌లో కంగూరులపై ప్రతిసారి ఇంగ్లండ్ తడబడతుందన్న వాదనకు ఫుల్‌స్టాప్ పెడుతూ.. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ నాలుగో టెస్టు(బాక్సింగ్ డే)లో విజయం సాధించింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఈ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగియడం.. అందులోనూ ఆతిథ్య ఆసీస్ ఓడటంతో అక్కడి పిచ్‌పై చర్చ మొదలైంది.
మెల్‌బోర్న్ మ్యాచులో ఒకే రోజు 20 వికెట్లు పడిన సంగతి తెలిసిందే. దీంతో పిచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అంతకుముందు పెర్త్‌లోనూ ఇలాగే జరిగింది. అయినా పిచ్‌కు ఐసీసీ నుంచి మంచి రేటింగ్ వచ్చింది. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను సంధించాడు.
‘ఆస్ట్రేలియాలో మరో మ్యాచు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఆసీస్ క్రికెట్ బోర్డు సీఈవో మాట్లాడుతూ ఇది బాగోలేదు అని చెప్పారు. చాలా మంది క్రికెట్ అభిమానులు మెల్‌బోర్న్ పిచ్ నాణ్యత గురించి స్పందించారు. పెర్త్‌లోని తొలి టెస్టు మ్యాచుకు మంచి రేటింగ్ ఇవ్వడంతో రిఫరీ రంజన్ మదుగలే ఆశ్చర్యపోయారు. మెల్‌బోర్న్, సిడ్నీ పిచ్‌లకు మ్యాచ్ రిఫరీ మారిపోయారు. తప్పకుండా భిన్నంగా రేటింగ్ వస్తుందేమో అనుకుంటున్నా. ‘వెరీ గుడ్’ నుంచి ఏ పదాన్ని తీసేస్తోరో చూడాలి’ అని సన్నీ వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి
వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు