National Senior Badminton Championship: చాంపియన్ చరిష్మా
ABN , Publish Date - Dec 29 , 2025 | 04:45 AM
తెలుగు యువ కెరటం సూర్య చరిష్మా తమిరి జాతీయ బ్యాడ్మింటన్‌లో సంచలనం సృష్టించింది. 19 ఏళ్ల ఈ విజయవాడ అమ్మాయి జాతీయ సీనియర్ చాంపియన్‌షి్‌పలో సింగిల్స్...
పురుషుల విజేత రిత్విక్
సాత్విక్‌కు మిక్స్‌డ్ టైటిల్
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్
విజయవాడ సిటీ (ఆంధ్రజ్యోతి): తెలుగు యువ కెరటం సూర్య చరిష్మా తమిరి జాతీయ బ్యాడ్మింటన్‌లో సంచలనం సృష్టించింది. 19 ఏళ్ల ఈ విజయవాడ అమ్మాయి జాతీయ సీనియర్ చాంపియన్‌షి్‌పలో సింగిల్స్ ట్రోఫీ దక్కించుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో చరిష్మా 17-21, 21-12, 21-14తో తన్వి పత్రిని ఓడించి కొత్త చాంపియన్‌గా అవతరించింది. గతరౌండ్లలో టాప్‌సీడ్ ఉన్నతి హుడా లాంటి టాప్ షట్లర్లను చిత్తుచేసిన చరిష్మా.. తుది పోరులోనూ అంతే దూకుడుగా విజృంభించింది. దాదాపు గంటపాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్ కోల్పోయినా ఏమాత్రం వెరవని చరిష్మా.. తర్వాతి రెండు గేముల్లో అద్భుతంగా పుంజుకొని పైచేయి సాధించింది. కెరీర్‌లో తొలిసారి సీనియర్ చాంపియన్‌షి్‌పను కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను తమిళనాడు షట్లర్ రిత్విక్ సంజీవి గెలుచుకున్నాడు. ఫైనల్లో రిత్విక్ 21-16, 22-20తో భరత్ భార్గవ్ (హరియాణా)ను ఓడించాడు.

ఇక, హైదరాబాద్‌కు చెందిన సాత్విక్ రెడ్డి మిక్స్‌డ్ డబుల్స్ విజేతగా నిలిచాడు. మిక్స్‌డ్ ఫైనల్లో సాత్విక్/రాధికా శర్మ (పంజాబ్) జంట 21-9, 21-15తో కర్ణాటక జోడీ అశిత్ సూర్య/అమృతపై నెగ్గింది. పురుషుల డబుల్స్‌లో హరిహరన్/రూబన్ ద్వయం, మహిళల డబుల్స్‌లో శిఖా గౌతమ్/అశ్వినీ జంటలు విజేతలుగా నిలిచారు.
ఇవి కూడా చదవండి
వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు