Home » Virat Kohli
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరిందనే సంకేతాలు ఇచ్చేశాడు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. వన్డేల్లోనే కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భవిష్యత్తుపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు గిల్ సుదీర్ఘకాలం నాయకత్వం వహిస్తాడని అభిప్రాయపడ్డాడు.
వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు.
‘మీరు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్లేయర్ ఎవరు?’ అని ప్రశ్నించగా.. టెస్ట్ దిగ్గజం చతేశ్వర్ పుజారా అని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సమాధానం చెప్పాడు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ లండన్‌లో కలిశాడు. శుక్రవారం జరిగిన ఈ భేటీలో క్రీడలు, మౌలిక వసతులు, మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ఇరువురూ చర్చించారు.
2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. టోర్నీపై చర్చ ఇప్పటికే మొదలైంది. మాజీలు, విశ్లేషకులు మెగా టోర్నీపై తమ అంచనాలను, తమతమ ఫేవరెట్ జట్లను వెల్లడిస్తున్నారు.
పాకిస్థాన్ క్రికెటర్లు కూడా కోహ్లీ వన్8 షూ ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా భారత్-పాక్ మ్యాచ్ అంటే ఆసక్తి ఉంటుంది. కానీ ఈ సారి పాక్ ప్లేయర్లు ధరించిన షూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
వన్డే ప్రపంచ కప్‌లో రో-కోకు అవకాశం దక్కుతుందా? అనే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. ప్రపంచ కప్‌లో రో-కో ఆడుతారా? లేదా? అని ఇప్పుడే చెప్పడం తొందరపాటేనని వెల్లడించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. న్యూజిలాండ్ గడ్డపై గతంలో ఈ ఇద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని గుర్తు చేస్తూ.. ఈసారి మాత్రం అలాంటి అవకాశాన్ని ఇవ్వబోమని తెలిపాడు.
వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్ ఎవరు? అనే ప్రశ్నకు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒక్క మాటలో సమాధానం ఇచ్చేశాడు. భారత దిగ్గజం విరాట్ కోహ్లీనే వన్డే ఫార్మాట్‌లో తాను చూసిన అత్యుత్తమ ఆటగాడని స్పష్టం చేశాడు.