Home » Viral News
ఒక్క క్షణం ముందు వరకు అంతా సాధారణంగానే ఉంది. నదీ తీరంలో ఎంజాయ్ చేస్తున్న ఓ యువతి.. తనవైపు మృత్యువు దూసుకొస్తుందని అసలు ఊహించలేదు. అకస్మాత్తుగా మొసలి ఆమె వైపు రావడంతో భయంతో పరుగులు పెట్టింది.
బెంగళూరులో మూడేళ్లుగా ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ.. కార్పొరేట్ ఉద్యోగ జీవితంలోని ఒత్తిడిని స్కూల్ పరీక్షలతో పోలుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు లువురు నెటిజన్లను ఆకట్టుకోవడం సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రయాణికులతో మాట్లాడేందుకు భాష అడ్డంకిగా మారితే ఏం చేయాలి?.. ఈ సమస్య పరిష్కారానికి ఓ ముంబై ఆటో డ్రైవర్ చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణికులతో రోజూ ఎదురయ్యే సాధారణ సంభాషణలను సులభంగా మాట్లాడేందుకు అతను వినూత్నంగా ఆలోచించాడు.
చైనాలో పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోతుండటంతో ప్రభుత్వం కొత్త మార్గాలను అనుసరిస్తోంది. యువత పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, పార్కులు, దేవాలయాల్లోనూ వివాహ రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ చేసిన పని సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తొమ్మిది సంవత్సరాల పాటు దాచిన డబ్బుతో ఎవ్వరూ ఊహించని పని చేసి కుటుంబ సభ్యులను సర్‌ప్రైజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
బ్రిడ్జ్ మీద రైల్వే ట్రాక్‌పై ఒంటె చిక్కుకుపోయింది. దీనిని స్థానికులు, జేసీబీ సాయంతో ట్రక్‌పై నుంచి పక్కకు తీసి.. ఒంటె ప్రాణాలు కాపాడారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
భూమి మీద నూకలు ఉంటే ఎంత పెద్ద ఆపద నుంచి అయినా రెప్పపాటులో బయటపడతాం. ఎలాగైనా బతికేస్తాం అనేందుకు ఈ ఘటనే ఓ ఉదాహరణ. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
కుమారుడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళ బంగారు నగల బ్యాగ్ మాయమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బ్యాగ్ చోరీ చేసిన దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా వారికి షాకింగ్ విషయం కనిపించింది.
రైలులో ప్రయాణించేటప్పుడు జనరల్ బోగీలో చోటు సంపాదించడం, ఆర్డినరీ బస్సులో సీటు సంపాదించడం చాలా కష్టం. అందులో ప్రయాణించే వాళ్లకే తెలుస్తోంది అది ఎంత కష్టమనేది.
చైనా ప్రముఖ వీడియో షేరింగ్ వేదిక బిలిబిలి పాశ్చాత్య దేశాల మార్కెట్లపై దృష్టి సారించింది. యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఈ సంస్థ.. అంతర్జాతీయంగా కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి 1,000 వ్యూస్‌కు సుమారు 0.70 డాలర్ చెల్లించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.