మురుగు నీటితో ఉల్లిపాయలను కడుగుతున్నారా.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..
ABN , Publish Date - May 30 , 2026 | 11:27 AM
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఉల్లిపాయలను కాలువలో ఉన్న మురుగు నీటితో కడుగుతుండడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఉల్లిపాయలను కాలువలో ఉన్న మురుగు నీటితో కడుగుతుండడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. @Pajeet101_us అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు (Sewer Water Vegetables).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మురుగు నీటి కాలువ పక్కన కొందరు కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఒక వ్యక్తి మురుగు నీటితో ఉల్లిపాయలను కడిగి ట్రేలో వేస్తున్నాడు. అతడు అలా చేస్తుండడాన్ని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై సోషల్ మీడియా జనాలు ఆగ్రహంగా స్పందించారు (Vegetable Vendor Viral Video).
ఈ వీడియో చూసిన తర్వాత రోడ్ల పక్కన పళ్లు, కూరగాయలు కొనాలంటే భయమేస్తోందని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు (Shocking Video). ఆ వ్యక్తి ప్రతీ కిలోకు ఉచితంగా ఇమ్యూనిటీ బూస్టర్ ప్యాకేజీ ఇస్తున్నాడని మరొకరు కామెంట్ చేశారు. మనదేశంలో పళ్లు, కూరగాయలు కొన్న తర్వాత కచ్చితంగా రెండు, మూడు సార్లు కడిగి తీరాల్సిందేనని మరొకరు సూచించారు.
ఇవి కూడా చదవండి..
మాజీ సుప్రీం లీడర్ ఖమేనీకి అంత్యక్రియలు.. భారీ ఏర్పాట్లు చేస్తున్న ఇరాన్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే