Share News

బరువు పెరిగిన ట్రంప్.. ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఏమన్నారంటే..

ABN , Publish Date - May 30 , 2026 | 10:30 AM

గత మూడు నెలలుగా ఇరాన్ యుద్ధంలో తలమునకలై ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారం బయటకు వచ్చింది. 79 ఏళ్ల ట్రంప్ ఇటీవల వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

బరువు పెరిగిన ట్రంప్.. ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఏమన్నారంటే..
Trump Health Report

గత మూడు నెలలుగా ఇరాన్ యుద్ధంలో తలమునకలై ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారం బయటకు వచ్చింది. 79 ఏళ్ల ట్రంప్ మంగళవారం వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ వైద్య నివేదిక ప్రకారం ట్రంప్ బరువు 238 పౌండ్లు (సుమారు 108 కిలోలు). బరువు కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్యం అద్భుతంగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు (Trump 108 Kg).


ఇంతకుముందు గతేడాది ఏప్రిల్‌‌లో ట్రంప్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అప్పటితో పోలిస్తే ఏడాది కాలంలో ట్రంప్ ఆరు కిలోల మేర బరువు పెరిగారు. తాజాగా ట్రంప్‌నకు వైద్యులు గుండె, ఊపిరితిత్తులు, నరాల వ్యవస్థతో పాటు పలు కీలక పరీక్షలు చేశారు. ట్రంప్‌నకు స్వల్ప స్థాయిలో కాళ్ల వాపు, చేతులపై చిన్నపాటి గాయాల మచ్చలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తరచుగా ప్రజలతో కరచాలనం చేయడం, గుండె రక్షణ కోసం తీసుకుంటున్న ఆస్పిరిన్ మందుల ప్రభావం వల్లే అవి కనిపిస్తున్నాయని వివరించారు (Trump Health Report).


గత ఏడాదితో పోలిస్తే ట్రంప్ బరువు కొంత పెరిగినప్పటికీ.. ఆయన శారీరక, మానసిక సామర్థ్యాలు బలంగానే ఉన్నాయని వైద్య బృందం పేర్కొంది (Trump Weight Gain). ఆయనకు ఆహార నియంత్రణ, వ్యాయామం గురించి పలు సూచనలు సూచించినట్లు తెలిపింది. కాగా, మంగళవారం 22 మంది వైద్య నిపుణుల పర్యవేక్షణలో ట్రంప్ వైద్య పరీక్షలు జరిగాయి.


ఇవి కూడా చదవండి..

మాజీ సుప్రీం లీడర్ ఖమేనీకి అంత్యక్రియలు.. భారీ ఏర్పాట్లు చేస్తున్న ఇరాన్..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే

Updated Date - May 30 , 2026 | 11:39 AM