సినిమా థియేటర్‌లో షాకింగ్ ఘటన.. ప్రేక్షకుల వైపు దూసుకొచ్చిన కారు..
ABN , Publish Date - May 30 , 2026 | 08:32 AM
సినిమా స్క్రీన్‌ను కారు బద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా రేంజ్‌లో జరిగిన ఈ ఘటన ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఒక్కసారిగా కారు తమ వైపు దూసుకురావడంతో థియేటర్ నుంచి వారంతా పరుగులు తీశారు.
ఇంటర్నెట్ డెస్క్: సినిమా స్క్రీన్‌ను కారు బద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా రేంజ్‌లో జరిగిన ఈ ఘటన ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఒక్కసారిగా కారు తమ వైపు దూసుకురావడంతో థియేటర్ నుంచి వారంతా పరుగులు తీశారు. ఇది ఏఐ జనరేటెడ్ వీడియోనా, లేక నిజంగా జరిగిందా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ, వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సినిమా థియేటర్‌లో ప్రేక్షకులు ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. స్క్రీన్‌పై సినిమా ప్రదర్శితమవుతుండగా రోడ్డుపై కారు వెళ్తున్న సీన్ వస్తోంది. అది సరిగ్గా ప్రేక్షకుల వైపు వస్తున్నట్లుగా కనిపించింది. అయితే, అదే సమయంలో నిజంగానే ఓ కారు ప్రేక్షకులను భయాందోళనలకు గురి చేసింది. సరిగ్గా సినిమా సీన్‌కు సరిపోయేలా మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ కారు.. సినిమా స్క్రీన్‌ను చీల్చుకుంటూ థియేటర్‌లోకి దూసుకొచ్చింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కొంతమంది ప్రేక్షకులు అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టగా, మరికొంతమంది ఏం జరుగుతుందో అర్థంకాక సీట్లలోనే కూర్చుని ఆశ్చర్యపోయారు.
ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండగా నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 'నిజ జీవిత సినిమా క్లైమాక్స్ సీన్' అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. '4డీ సినిమా అనుభవానికి ఇది తీవ్రమైన రూపం' అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. 'ఇప్పటివరకు చూసిన యాక్షన్ సన్నివేశాల్లో అత్యంత వాస్తవికమైనది' అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇలా పలు రకాల కామెంట్ల మధ్య వీడియో వైరల్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
గాయపడిన నెమలికి సాయం చేయాల్సింది పోయి.. ఈకలు పీకేశారు..
తాజా పాల పేరుతో ప్యాకెట్ పాల అమ్మకం.. వీడియో వైరల్