Share News

గాయపడిన నెమలికి సాయం చేయాల్సింది పోయి.. ఈకలు పీకేశారు..

ABN , Publish Date - May 29 , 2026 | 04:10 PM

రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్ర నొప్పితో విలవిల్లాడుతున్న జాతీయ పక్షి నెమలిపై కొందరి అమానుష వైఖరి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గాయపడిన నెమలికి సాయం చేయాల్సింది పోయి.. ఈకలు పీకేశారు..
Injured Peacock Viral Video

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్ర నొప్పితో విలవిల్లాడుతున్న జాతీయ పక్షి నెమలిపై కొంతమంది అమానుషంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వాహన ప్రమాదంలో నెమలి తీవ్రంగా గాయపడి, రోడ్డుపక్కన కదల్లేని నిస్సహాయ స్థితిలో పడి ఉండగా.. అక్కడున్న వారు దానికి సాయం చేయడానికి బదులుగా అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అటవీశాఖ అధికారులు లేదా జంతు సంరక్షణ సంస్థలకు సమాచారమిస్తారు. కానీ, అక్కడున్న కొందరు వ్యక్తులు నెమలి ఈకల కోసం కక్కుర్తిపడ్డారు.


ఓ వైపు నెమలి నొప్పితో విలవిల్లాడుతున్నా ఏమాత్రం జాలి లేకుండా, దాని ఈకలను ఒక్కొక్కటిగా పీకడం ప్రారంభించారు. మరికొందరు కిందపడిన ఈకలను పోటీపడి పోగుచేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్టు వీడియోలో కనిపించారు. సమాజంలో మానవత్వం కనుమరుగవుతోందని, బాధపడుతున్న పక్షిని కాపాడటానికి బదులుగా ప్రజలు ఇలా ఈకలు సేకరించ పనిలో నిమగ్నమవ్వడం దారుణమని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

వడదెబ్బ బాధితుల కోసం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు: డాక్టర్ వాణి

అవలాంజి అటవీ ప్రాంతంలో తెల్ల పులి సంచారం

Updated Date - May 29 , 2026 | 07:55 PM