Share News

తిరోగమనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు

ABN , Publish Date - May 29 , 2026 | 11:32 AM

మూడు రోజుల పాటు వరుసగా తగ్గిన బంగారం ధరలు నేడు మరోసారి పెరిగాయి. వివిధ నగరాల్లో ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

తిరోగమనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు
Gold, Silver Rates on May 29

ఇంటర్నెట్ డెస్క్: గత మూడు రోజులుగా భారత్‌లో వరుసగా తగ్గిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా యూటర్స్ తీసుకున్నాయి. రెండు రోజుల తిరోగమనానికి బ్రేక్ చెప్పిన వెండి ధరలు కూడా నేడు ఓ మోస్తరు స్థాయిలో పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మే 29) ఉదయం 11.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,57,640కు ఎగబాకింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే ధర రూ.1,580ల మేర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ.1,450ల మేర పెరిగి రూ.1,44,500కు చేరింది. వెండి ధరలో కూడా ఓ మోస్తరు పెరుగుదల నమోదైంది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి రూ.5 వేల మేర పెరిగి రూ.2.9 లక్షలకు ఎగబాకింది. విజయవాడలో కూడా ఇవే రేట్స్ ఉన్నాయి (Gold, Silver Rates on May 29).


దేశవ్యాప్తంగా 24 క్యారెట్ పసిడి ధర సగటున రూ.1,550ల మేర పెరిగింది. వెండి రేటులో కూడా సగటున రూ.5 వేల మేర పెరుగుదల కనిపించింది. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,280గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,000గా ఉంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,640గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,44,500గా ఉంది. దేశరాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,790 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,44,650గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4,514 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 75 డాలర్ల వద్ద తచ్చాడుతోంది.


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

రూపాయి పతనాన్ని ఆపొద్దు.. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ సూచన

ఆరో ఏడాదీ జీతం తీసుకోని అంబానీ

Updated Date - May 29 , 2026 | 12:41 PM