Share News

ఆరో ఏడాదీ అంబానీ జీతం తీసుకోలేదు..

ABN , Publish Date - May 29 , 2026 | 04:43 AM

ఆసియాలో రెండో అత్యం త ధనవంతుడు ముకేశ్‌ అంబానీ తన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) నుంచి వరుసగా ఆరో ఏడాదీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు...

ఆరో ఏడాదీ అంబానీ జీతం తీసుకోలేదు..

న్యూఢిల్లీ: ఆసియాలో రెండో అత్యం త ధనవంతుడు ముకేశ్‌ అంబానీ తన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) నుంచి వరుసగా ఆరో ఏడాదీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు. ప్రస్తుతం కంపెనీ వాటాదారుగా లభించే డివిడెండే ఆయనకు ఆదాయ వనరు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా 11 ఏళ్లపాటు (2019-20 వరకు) ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌గా తన వార్షిక జీతాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్న అంబానీ.. కంపెనీ వ్యాపారంపై కరోనా సంక్షోభ ప్రభావం నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి తన పారితోషికాన్ని పూర్తిగా వదులుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించారని ఆర్‌ఐఎల్‌ వార్షిక నివేదిక వెల్లడించింది.

ముకేశ్‌ అంబానీ వ్యక్తిగతంగా 1.61 కోట్ల రిలయన్స్‌ షేర్లను కలిగి ఉన్నారు. ఆయన నియంత్రణలోని ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీలు 50.07 శాతం వాటాకు సమానమైన 664.5 కోట్ల షేర్లను కలిగి ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఐఎల్‌ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్‌ చెల్లించింది. ఆ లెక్కన అంబానీకి వ్యక్తిగతంగా రూ.9.66 కోట్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీల ద్వారా రూ.3,987 కోట్ల డివిడెండ్‌ ఆదాయం లభించింది.

ఇవి కూడా చదవండి..

అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే.

Updated Date - May 29 , 2026 | 04:43 AM