Home » Viral News
మహిళా డ్రైవర్, ఓ యువకుడికి మధ్య జరిగిన వాడివేడి సంభాషణ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టడమే కాకుండా అడ్డగోలు వాదనకు దిగిన మహిళపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
అయోధ్యలో దారుణ ఘటన వెలుగు చూసింది. కాషాయ వస్త్రాలు ధరించిన కొందరు యువకులు పబ్లిక్ పార్కులో ప్రేమ జంటపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పారిపోయేందుకు ప్రయత్నించినా వెంబడించి మరీ పిడిగుద్దులు కురిపించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. విదేశీ యువతి పట్ల ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..
మండిపోతున్న ఎండల్లో తాజ్ మహల్ ప్రాంగణంలో కోతులు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీహార్‌లో కదిలే రైలు కిటికీ నుంచి ఒక భారీ ఇనుప ట్రంకు పెట్టె ప్రమాదకరంగా వేలాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఈ దృశ్యంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఓ ప్రేమోన్మాది మాజీ ప్రేయసిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే కత్తితో పలుమార్లు పొడిచి ప్రాణాలు తీశాడు. అడ్డుకోబోయిన సహోద్యోగులను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అనంతరం కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్ కారణంగా జీవితం పాడవుతోందని గ్రహించి ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాడు. స్మార్ట్ ఫోన్ వాడకం మానేశాడు. స్మార్ట్ ఫోన్ నుంచి ఫ్లిప్ ఫోన్‌కు మారాడు. దీంతో అతడి జీవితంలో పెను మార్పులు వచ్చాయి.
భారతీయ పర్యాటకురాలికి స్విట్జర్లాండ్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఊహించని రీతిలో జరిమానా విధించారు. పర్యటన పూర్తయిన ఏడాది తర్వాత స్విట్జర్లాండ్ పోలీసుల నుంచి ఈ-మెయిల్ రావడంతో సదరు మహిళ షాక్‌కు గురయ్యారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్-ఖండ్వా రహదారిపై భేరుఘాట్ సమీపంలో ఆదివారం నాడు వాటర్ పైప్‌లైన్ పగిలిపోవడం విధ్వంసానికి దారి తీసింది. మౌలో నర్మదా-క్షిప్రా పైప్‌లైన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పగిలిపోయింది. సుమారు 150 అడుగుల ఎత్తుకు నీటి ధార ఆకాశంలోకి ఎగజిమ్మింది.
మనదేశంలో ఎక్కువ మంది రైలు ప్రయాణాలంటేనే ఇష్టపడతారు. తక్కువ ఛార్జీలతో, సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలంటే రైళ్లను ఆశ్రయించాల్సిందే. అయితే రైలులో దొరికే ఆహార పదార్థాలంటే మాత్రం అందరూ భయపడతారు.