Chinese Woman: ప్రియుడి భార్య ఎంట్రీ.. 10వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడిన మహిళ.. తర్వాత..
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:08 PM
ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న ఓ మహిళ అతని భార్య సడెన్ గా ఎంట్రీ ఇవ్వడంతో షాక్ కి గురైంది. తప్పించుకునే ప్రయత్నంలో 10వ అంతస్తు బాల్కానీ నుంచి కిందకు దిగే ప్రయత్నం చేయగా అది కాస్త బెడిసి కొట్టింది.
ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కాపురాలు కుప్పకూలి పోతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. తాజాగా చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచిచాడు. అంతలోనే అతని భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక భయపడి తన ప్రియురాలిని బాల్కానీలో దాక్కోమని బలవంతం చేశాడు.
ఆ మహిళ బాల్కానీ నుంచి కిందకు చూసి భయంతో వణికిపోయింది. కొద్ది సేపటి వరకు రెయిలింగ్ ని పట్టుకొని వేలాడింది. ఆ తర్వాత మెల్లిగా డ్రెయిన్ పైపులు, కిటికీల పట్టుకుంటు కిందికి దిగడం ప్రారంభించింది. ఒళ్లు గగుర్పొడిచే ఆ దృశ్యాన్ని చూస్తూ కింద ఉన్నవాళ్లు ఆందోళన పడ్డారు. కొంత దూరం కిందకు దిగిన తర్వాత ఓ కిటికీని తట్టింది.. లోపలి నుంచి ఓ వ్యక్తి ఆమె పరిస్థితి చూసి జాలిపడి లోపలికి లాగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ భయానక సంఘటనకు సంబంధించి వీడియోలో ఆమె ప్రియుడు మాట్లాడుతూ లోపలికి వెళ్లడం కనిపిస్తుంది. అంత డేంజర్ పరిస్థితిలో ఆమెను రక్షించే ప్రయత్నం కూడా చేయలేదు.
ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్ నెట్ లో తెగ వైరల్ అవుతుంది.చాలా మంది నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆమె ప్రియుడు ఓ పిరికి పంద.. ఓ మహిళను నిర్ధాక్షిణ్యంగా వదిలి వేశాడు అంటూ విమర్శించారు. మరికొంత మంది ఎలాంటి భద్రత లేకుండా ఇలాంటి సాహసాలు చేయడం మూర్ఖత్వం అంటూ విమర్శించారు. అదృష్టం బాగుంది.. ఒక్క అడుగు జారినా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
అలాంటి కన్నింగ్ వ్యక్తి కోసం ప్రాణాలు ఇలా పణంగా పెట్టడం సరికాదు అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. కొంత కాలంగా చైనాలో విడాకుల రేటు గణనీయంగా పెరిగిపోయింది. 1998 నుంచి 2018 మధ్య విడాకుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగినట్లు సమాచారం. 2023 నాటికి, 3.6 మిలియన్లకు పైగా జంటలు విడాకుల కోసం దాఖలు చేశాయి. దీన్ని అరికట్టేందుకు.. అక్కడి ప్రభుత్వం విడాకులు కోరే జంటకు ముప్పై రోజుల పాటు ‘కూలింగ్ - ఆఫ్’ పిరియడ్ ని తప్పనిసరి చేసింది. దీని ద్వారా 30 రోజుల్లోపు దరఖాస్తును ఉపసంహరించుకునే అవకాశం లభించింది.
" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowfullscreen="true" allow="autoplay; clipboard-write; encrypted-media; picture-in-picture; web-share" allowFullScreen="true" loading="lazy">