Dhoni fan groom: ఎంత ధోనీ ఫ్యాన్ అయితే మాత్రం.. పెళ్లికి ముందు ఇలాంటి రూల్ పెడతారా..
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:55 AM
వివాహ సమయంలో వధూవరులు ఒకరికొకరు చాలా ప్రమాణాలు చేసుకుంటారు. అగ్ని దేవుడి సాక్షిగా, బంధువులు, కుటుంబ సభ్యుల ఎదుట కాబోయే భాగస్వామికి కొన్ని ప్రమాణాలు చేస్తారు. అవి సాధారణ జీవితానికి సంబంధించినవే అయి ఉంటాయి.
వివాహ సమయంలో వధూవరులు ఒకరికొకరు చాలా ప్రమాణాలు చేసుకుంటారు. అగ్ని దేవుడి సాక్షిగా, బంధువులు, కుటుంబ సభ్యుల ఎదుట కాబోయే భాగస్వామికి కొన్ని ప్రమాణాలు చేస్తారు. అవి సాధారణ జీవితానికి సంబంధించినవే అయి ఉంటాయి. అయితే తాజాగా ఓ వరుడు తనకు కాబోయే భార్యను పెళ్లిలో విచిత్రమైన అనుమతి కోరాడు. ఆ వెడ్డింగ్ అగ్రిమెంట్ పెళ్లి మండపంలో ఉన్న అందరికీ విపరీతంగా నవ్వు తెప్పించింది (funny wedding moment).
వరుడు తన dhruvmajethia7 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వరుడు ధ్రువ్ మజెథియా, వధువు అషిమా వివాహ హాలులో కూర్చుని ఉన్నారు. వరుడు రాసిన అగ్రిమెంట్‌ను వధువు అందరి ఎదుట బహిరంగంగా చదువుతోంది. 'నేను, ధృవ్ మజెథియా. పెళ్లి తర్వాత అషిమా నాకు ఎలాంటి పరిమితులు పెట్టకుండా ధోనీ సీఎస్కే, ఆర్సీబీ ఆడే అన్ని మ్యాచ్‌లను చూడటానికి అనుమతించాలి. అప్పుడే నేను సంతోషంగా, హృదయపూర్వకంగా ఆమెతో ఏడు అడుగులు వేస్తానని మాటిస్తున్నా' అని ధృవ్ రాసిన అగ్రిమెంట్‌ను చదివింది (bride reads agreement).
ఆషిమా ఆ అగ్రిమెంట్ చదువుతుండగా, అతిథులు నవ్వులు, చప్పట్లతో ఉత్సాహంగా గడిపారు (Indian wedding humor). ఈ ఒప్పందం డిసెంబర్ 2 నుంచి చట్టబద్ధంగా అమలులోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. అలాగే వివాహం తర్వాత మ్యాచ్ చూడటానికి అనుమతించకపోవడాన్ని ఒప్పంద ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కూడా రాసుకున్నారు. ఈ ఫన్నీ అగ్రిమెంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి వాగ్దానాలు ఉంటే, వివాహం మరింత సరదాగా మారుతుందని చాలా మంది కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
గీజర్ కంపెనీల సేల్స్‌కు పెద్ద దెబ్బ.. వేడి నీటి కోసం ఎలాంటి ట్రిక్ కనిపెట్టాడో చూడండి..
మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. క్రిస్‌మస్ ట్రీలో దాక్కున్న పిల్లిని 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..